ఆస్తుల వివరాలు ఇస్తేనే.. ప్రమోషన్ లేదంటే అంతే..!
ఐఏఎస్ అధికారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీవోపీటీ) అల్టిమేటం జారీ చేసింది. వచ్చే నెల నాటి (జనవరి 31, 2018)కి తమ ఆస్తుల వివరాలు ఇవ్వాలని లేదంటే ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించి విజిలెన్స్ అనుమతులు నిలిపివేస్తామని డీవోపీటీ హెచ్చరించింది. ఒకవేళ ఎవరైనా వివరాలు సమర్పించకపోతే వారికి విజిలెన్స్ విభాగం క్లియరెన్స్ ఇవ్వదనీ, తత్ఫలితంగా పదోన్నతులకు.. విదేశాల్లో పోస్టింగ్స్ పొందడానికి..అనర్హులవుతారని హెచ్చరించింది.
డీవోపీటీ నిబంధనలు ఏప్రిల్ 4, 2011 ప్రకారం.. 2018 జనవరి 1 నాటికి ఐపీఆర్ దాఖలు చేయని అధికారులకు సంబంధించిన ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించిన విజిలెన్స్ అనుమతులను నిరాకరిస్తారు. ఐపీఆర్ దాఖలు చేయని అధికారులకు సంబంధించిన ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించిన విజిలెన్స్ అనుమతులు నిలిపివేస్తామని అడిషనల్ సెక్రటరీ పీకే త్రిపాఠి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక డీవోపీటీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,004 మంది ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.