Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

DP Stifling Opposition Voice: YS Jagan

By   /  March 24, 2016  /  Comments Off on DP Stifling Opposition Voice: YS Jagan

    Print       Email

Jagan Mohan Reddy1

విపక్షం గొంతు నొక్కుతున్నారు: వైఎస్ జగన్..

InCorpTaxAct
Suvidha

 

వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతోందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. అయితే ప్రభుత్వం విపక్షం గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన ఏపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాదు.. పర్యటనలో భాగంగా ఆయన ఆనం విజయ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.

జగన్ కు అపూర్వ స్వాగతం

వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వచ్చిన జగన్ కి జిల్లా వాసులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం చెప్పారు. తర్వాత జిల్లా కేంద్రంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో జరిగిన కార్యకర్తల భేటీలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయ్‌కుమార్‌తో పాటు ఆయన కుమారుడు ఆనం కార్తీక్‌రెడ్డి కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా జగన్ ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు గుప్పించారు. ప్రలోభాలకు పార్టీని వీడిన వారికి, అమ్ముడుపోయిన వారికి కనువిప్పు కలిగేలా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం విపక్ష పార్టీ నేతల గొంతు నొక్కే రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలే చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ చెప్పారు. నాయకుడి వ్యక్తిత్వం, విశ్వసనీయత లాంటి లక్షణాలు ఉండాలని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబులో ఆ రెండు లక్షణాలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. అంతకుముందు నాయుడుపేట అమరావతి సెంటర్‌ దగ్గర పార్టీ కార్యాలయాలన్ని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →