Loading...
You are here:  Home  >  Literature  >  Current Article

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

By   /  April 27, 2016  /  Comments Off on మనసున మనసై బ్రతుకున బ్రతుకై

    Print       Email
TeluguFilm_Doctor_Chakravarthi
చిత్రం : డాక్టర్ చక్రవర్తి
గానం : ఘంటసాల 
రచన     : శ్రీ శ్రీ 
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
విశేషాలు– అందరూ ఈ పాటను మనసుకవి ఆత్రేయ రాసాడని అనుకుంటారు. మహాకవి శ్రీ శ్రీ ఈ పాటను ఆయన శైలిలో అద్భుతంగా రాసారు!అన్ని వేళలా మనసును అర్ధం చేసుకునే ‘తోడొకరుందిన అదే భాగ్యం,అదే స్వర్గం.’ఇంతకన్నా ఏ మనిషికైనా కావలసింది ఏముంది?ఇక సినిమా విశేషాలు కొన్ని తెలుసుకుందాం!డాక్టర్ చక్రవర్తి 1964లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగులో నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒక ప్రసిద్ధి చెందిన సినిమా. కోడూరు కౌసల్యాదేవి రచించిన “చక్ర భ్రమణం” ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. ఇందులో చాలా పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా, నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము వంటి పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరించాయి. మరణించిన చెల్లెల్ని తన స్నేహితుని భార్యలో చూసుకునే వ్యక్తిని ఆ స్నేహితుడు అపార్థం చేసుకోవడం ముఖ్యకథాంశంగా అత్యంత జనాదరణ పొందిన కోడూరి కౌసల్యాదేవి నవల చక్రభ్రమణం ఆధారంగా సినిమా తీయాలని అన్నపూర్ణ వారు హక్కులు కొన్నారు.అంతకు కొన్నేళ్ళ క్రితం ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కె.విశ్వనాథ్ ని అన్నపూర్ణ పిక్చర్స్ లో
దర్శకత్వ విభాగంలో పనిచేయమనీ, ఓ మూడు సినిమాలకు పనిచేశాకా దర్శకునిగా అవకాశం ఇస్తాననీ అక్కినేని నాగేశ్వరరావు ఆహ్వానించారు. అందుకు అంగీకరించి, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ వారి మూడు సినిమాలకు వరుసగా అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్. అంతకు కొన్నేళ్ళ క్రితం ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కె.విశ్వనాథ్ ని అన్నపూర్ణ పిక్చర్స్ లోఅయితే అప్పటికి తనపై తనకు పూర్తి విశ్వాసం కలగకపోవడంతో ఆయన అప్పటికి సినిమా అవకాశాన్ని నిరాకరించారు. దాంతో ఆదుర్తి సుబ్బారావుకే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చక్రభ్రమణం నవలను సినిమాకు అనుగుణంగా మలిచి, స్క్రిప్ట్ ని గొల్లపూడి మారుతీరావు, రావూరి వెంకట సత్యనారాయణరావు తయారుచేశారు.
1962లో ఆంధ్రప్రభ వారపత్రిక నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన నవల కోడూరి కౌసల్యాదేవి రచించిన “చక్రభ్రమణం”. బహుళ పాఠకాదరణ పొందిన ఈ నవలను సినిమాగా తీయాలని సంకల్పించిన దుక్కిపాటి మధుసూధనరావు నవలలో ఏ పాత్ర ఎవరు ధరిస్తే బాగుంటుందని పాఠకులకు క్విజ్ నిర్వహించి, ఆ వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రధాన పాత్రల్ని ఎంపికచేశారు.డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1964లో మొదలుపెట్టిన నంది అవార్డుల్లో బంగారు నంది గెలుచుకున్నది. దానిద్వారా లభించిన 50,000 రూపాయల పెట్టుబడితో అక్కినేని-ఆదుర్తి ‘చక్రవర్తి చిత్ర’ పతాకంపై సుడిగుండాలు, మరో ప్రపంచం అనే ప్రయోజనాత్మక చిత్రాల్ని నిర్మించారు.ఈ చిత్రం విడుదలైన తర్వాత, అక్కినేని నాగేశ్వరరావు అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై భారతదేశ సాంస్కృతిక రాయబారిగా అమెరికాను సందర్శించారు. తన విదేశీ పర్యటన అనుభవాల్ని “నేను చూసిన అమెరికా” అనే గ్రంధంలో వివరించారు.
*****
 
మనసున మనసై బ్రతుకున బ్రతుకై 
తోడొకరుండిన అదే భాగ్యము 
అదే స్వర్గము.. 
||మనసున|| 
 
ఆశలు తీరని ఆవేశములో.. 
ఆశయాలలో.. ఆవేదనలో 
చీకటి మూసిన ఏకాంతములో 
తోడొకరుండిన అదే భాగ్యము. 
అదే స్వర్గము 
 
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు 
నీకోసమే కన్నీరు నింపుటకు -2 
 
నేనున్నానని నిండుగ పలికే 
తోడొకరుండిన అదే భాగ్యము 
అదే స్వర్గము 
 
చెలిమియె కరువై వలపే అరుదై 
చెదరిన హృదయమే శిలయై పోగా 
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే 
తోడొకరుండిన అదే భాగ్యము 
అదే స్వర్గము 
||మనసున|| 
ఈ పాటను  ఇక్కడ https://www.youtube.com/watch?v=W34q8Qp7al4 వినండి
టీవీయస్.శాస్త్రి 
TVS SASTRY  
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →