Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Dr.Kamal Hassan Speech at Harvard University

By   /  February 8, 2016  /  Comments Off on Dr.Kamal Hassan Speech at Harvard University

    Print       Email

kamal haasan speech at harvard university

సహనం కాదు.. అంగీకరించడం నేర్చుకోవాలి: కమల్ హాసన్

InCorpTaxAct
Suvidha

భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని దక్షిణాది ప్రముఖ నటుడు కమల్ హాసన్ అన్నారు. సహనం కాదని.. అంగీకరించడం నేర్చుకోవాలని సూచించారు. అందరినీ సమానంగా అంగీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనిర్సిటీ విద్యార్ధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో అసహనంపై స్పందించారు. తాను సహించడం అనే పదానికి వ్యతిరేకమని చెప్పారు. దేశంలో భిన్నత్వాన్ని ఓర్చుకోవడం కాదని.. అంగీకరించడం నేర్చుకోవాలన్నారు. అలా దేశం విడిపోకుండా కాపాడుకోవాలన్నారు.

పాక్,  బంగ్లాదేశ్ భారత్ నుంచి విడిపోయాయని గుర్తు చేశారు. ఇకనుంచి అయినా దేశ ఐక్యతను కాపాడుకోవాలని అన్నారు. ఇండియా.. రకరకాల రంగులు ఉన్న ఊలు దారాలను ఆకుపచ్చని దారంతో కలిపి అల్లిన స్వెటర్ లాంటిదని అభి వర్ణించారు. ఆ స్వెటర్ నుంచి ఆకుపచ్చని దారాన్ని లాగేస్తే .. అసలు ఏమీ ఉండదని చెప్పారు. కమల్ ఈ వ్యాఖ్యలు చేయగానే ఇండియన్ స్టూడెంట్స్ చప్పట్లతో హాలు మొత్తం మార్మోగింది. సహిస్తున్నాం అనే భావన వచ్చినప్పుడే అసహనం అనే పదం వస్తుందన్నారు. పలు రకాల ప్రజలను.. అందరూ తోటి పౌరులుగా గుర్తించాలని సూచించారు. దీంతో పాటు వాస్తవాలను అంగీకరిస్తే అసలు సహనం అనే ప్నశ్న రాదన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →