Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Dravid for Prime Minister of India!

By   /  March 2, 2018  /  Comments Off on Dravid for Prime Minister of India!

    Print       Email
రాహుల్ ద్ర‌విడ్ కాబోయే పీఎం.. ఇది అభిమానుల అభిప్రాయం
చాయ్ అమ్ముకునే వ్య‌క్తి ప్ర‌ధాన మంత్రి కాలేంది.. టీం ఇండియాకు కెప్టెన్‌గా ప‌నిచేసిన రాహుల్ ద్ర‌విడ్ పీఎం ఎందుకు కాలేడు? అనే వారు కొంద‌రైతే.. ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి అనేది అంత ఈజీనా అనేవారు మ‌రికొంద‌రు. స‌రే పోనీ.. రాహుల్ ద్ర‌విడ్ ప్ర‌ధాని అయ్యేరే అనుకున్నాం రాణించ‌గ‌ల‌డా అనేది మ‌రికొంద‌రి అనుమానం. అస‌లు ద్ర‌విడ్‌.. ప్ర‌ధాని ప‌ద‌వి గొడ‌వేంటి అనుకుంటున్నారా అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.
ఇటీవ‌ల న్యూజిలాండ్‌లో ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్‌ను భారత యువ జట్టు గెలిచిన సంగతి తెలిసిందే.నాలుగోసారి భారత యువ జట్టు టైటిల్ గెలవడంతో కోచ్ ద్రవిడ్‌కు (రూ. 50 లక్షలు), జట్టు సభ్యులకు (రూ. 30 లక్షలు), కోచింగ్ స్టాఫ్‌కు (రూ. 20 లక్షలు) నగదు పురస్కారాన్ని బీసీసీఐ ప్రకటించింది. ఇక్క‌డే వ‌చ్చింది స‌మ‌స్యంతా…
నగదు పురస్కారంలో అసమానతలను ద్రవిడ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఈ అసమానతలను సరిచేస్తూ కోచ్‌తో సహా అందరికీ రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్టు ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. ద్రవిడ్ ప్రవర్తనపై ట్విట్టర్‌లో పెద్ద చర్చ జరిగింది. ద్రవిడ్‌ను ప్రధానిని చేస్తే బాగుంటుందని చాలా మంది తమ అభిమతాన్ని తెలిపారు. ‘‘రాహుల్ ద్ర‌విడ్‌లో ప్ర‌ధాని అయ్యే సామ‌ర్థం ఉంది అని మాన‌వ్‌, రాహుల్ ద్ర‌విడ్‌ను ప్ర‌ధానిని చేస్తామ‌ని హామీ ఇచ్చే ఏ పార్టీకైనా నేను ఓటు వేస్తాన‌ని భ‌విక్‌, 2024 నాటికి ద్ర‌విడ్‌ను ప్ర‌ధానిని చేయాలి అని ద్వారిక యునియాల్ ఇలా చాలా మంది ట్విట్ట‌ర్ వేదిక‌గా వారి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ద్ర‌విడ్‌కు అస‌లు రాజ‌కీయాలంటే ఇష్టం ఉందో లేదో తెలియ‌దు కానీ.. ఆయ‌న‌పై పెద్ద చ‌ర్చే జ‌రిగింది.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Covid 19: Boston Doctors message

Read More →