Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Drugs Rocket : Kelvin revealed key points

By   /  July 17, 2017  /  Comments Off on Drugs Rocket : Kelvin revealed key points

    Print       Email

డ్రగ్స్ కేసు విచారణ : కీలక విషయాలు వెల్లడించిన కెల్విన్

 

InCorpTaxAct

 

 

డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేసింది. తెర మీద నీతులు చెప్పే వారి పేర్లు ఈ వ్యవహారంలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కెల్విన్ అనే డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన వ్యక్తిని పోలీసులు విచారించారు. అలాగే 12 మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఇదిలాఉంటే ఆదివారం మరోసారి కెల్విన్ ను విచారించారు. ఈ విచారణ సందర్భంగా అతను కీలక విషయాలను బయటపెట్టినట్లుగా సమాచారం. తన దగ్గర నుంచి ఎవరు డ్రగ్స్ కొనుగోలు చేసింది అతను వివరించాడట. అంతేకాదు డ్రగ్స్ అమ్మకాల కోసం అతను ఏకంగా 30 వాట్సాప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అతని ఖాతాదారుల్లో సినిమా హీరోలు, ప్రముఖ నిర్మాతలు వారి డ్రైవర్లు, రాజకీయ నేతలు, వ్యాపారస్థులకు చెందిన వారి పిల్లలు ఉన్నట్లుగా కెల్విన్ చెప్పినట్లు సమాచారం.

అసలు కెల్విన్ కు డ్రగ్స్ ఎక్కడి నుంచి అందుతున్నాయి అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కెల్విన్‌తో పాటు ఖుద్దూస్‌, వహీద్‌ను అబ్కారీ భవన్‌లో అధికారులు ప్రశ్నించారు. వారినుంచి కీలక విషయాలు రాబట్టినట్లుగా సమాచారం. అయితే దర్యాప్తు తర్వాతే అధికారులు మరికొంతమంది పేర్లు వెల్లడిస్తారని సమాచారం.ఇదిలాఉంటే ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనని సినిమా ప్రముఖులు బిక్కుబిక్కుమంటు ఉన్నారని ఫిల్మ్ నగర్ లో చర్చలు సాగుతున్నాయి.

Swapna
InCorpTaxAct
Centillion Networks
    Print       Email

You might also like...

AP will convert the drugs free state: Ganta Srinivasa Rao

Read More →