Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Dubai police about Boney Kapoor investigation

By   /  February 27, 2018  /  Comments Off on Dubai police about Boney Kapoor investigation

    Print       Email

బోనీ కపూర్ ని విచారించలేదు: దుబాయ్ పోలీసులు

 

InCorpTaxAct
Suvidha

 

శ్రీదేవి మృతి కేసుపై పలు రకాల అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు శ్రీదేవి భర్త బోనీ కపూర్ ని విచారించినట్లుగా వార్తలు వచ్చాయి. శనివారం రాత్రి 11 గంటలకు శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేశారు. అయితే ఫోరెన్సిక్‌ నివేదిక మాత్రం ఆమె బాత్‌ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిందని పేర్కొంది. అంతేకాకుండా ఆమె రక్తంలో మద్యం ఆనవాళ్లు కూడా ఉన్నాయని పేర్కొంది. దీంతో ఆమె మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు శ్రీదేవి మృతిపై ఆమె భర్త బోనీ కపూర్‌ను దుబాయ్‌ పోలీసులు మూడు గంటల పాటు విచారించారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై దుబాయ్ పోలీసులు ఓ ప్రకటన చేశారు. తాము అసలు బోనీ కపూర్ ని విచారించలేదని స్పష్టం చేశారు. శ్రీదేవి మరణంపై ఆయన వాంగ్మూలాన్ని ఆదివారం ఉదయం తీసుకున్నామని తెలిపారు. అంతేతప్ప ఆయన్ను ఎలాంటి విచారణ చేయలేదని స్పష్టం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →