Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Dulipalla gives shock to ChandraBabu

By   /  March 14, 2018  /  Comments Off on Dulipalla gives shock to ChandraBabu

    Print       Email

బాబుకు ధూళిపాళ్ల షాక్‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* అసెంబ్లీలో స‌ర్కార్ తీరును త‌ప్పుబ‌ట్టిన సొంత‌పార్టీ ఎమ్మెల్యే

* ఇంకా ఎంత‌మంది చ‌నిపోతే  స్పందిస్తార‌ని ఆగ్ర‌హం

* దీనిపై క‌చ్చితంగా మంత్రి స‌మాధానం ఇవ్వాల‌ని ప‌ట్టు

* విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నా సంబంధిత మంత్రి

డెక్క‌న్ అబ్రాడ్‌:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి సొంత‌పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా షాక్ ఇచ్చారు. స‌ర్కార్ చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తిచూపారు. ప్ర‌జ‌లు చ‌స్తున్నా ప‌ట్టించుకోరా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా అయితే ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌ను పొంద‌లేమ‌ని గ‌ట్టిగా చెప్పారు. వివ‌రాల్లోకి వెళ్లితే… గుంటూరులో అతిసార వ్యాధి విషయంలో మున్సిపల్ శాఖ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అసెబ్లీలో మాట్లాడారు.  కాలింగ్ అటెన్షన్ ద్వారా అతిసార విషయాన్ని ధూళిపాళ్ల ప్రస్తావించారు. రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో అతిసార కారణంగా 10మంది చనిపోతే సభలో కనీసం ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. అతిసార నివారణపై అధికార యంత్రాంగం స్పందించలేదన్నారు. ఫిర్యాదు వచ్చిన 3 రోజులకు అధికారులు స్పందించారన్నారు. గుంటూరు జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, కలుషితమైన నీరు తాగడం వలన తీవ్ర అస్వస్థతతో వందలమంది ఆస్పత్రి పాలయ్యార‌న్నారు. 10మంది ప్రాణాలు కోల్పోవడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.  సమస్య తీవ్రతను ప్రభుత్వ పరంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆస్పత్రిలో ఉన్న రోగులను పరామర్శించిన ఉన్నతాధికారులు, మంత్రులు, నేతలు వెళ్లారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కచ్చితమైన కారణాలు చెప్పుకపోవడం బాధాక‌ర‌మ‌న్నారు.

అసలు ఈ వ్యవహారంపై స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేద‌ని ధూళిపాళ్ల ప్ర‌శ్నించారు. న‌లభై ఏళ్ల కిందట తాగునీటి పైపులైన్ వేశామని సంబంధిత మంత్రి  చెబుతున్నార‌ని,  వాటిని పర్యవేక్షించే బాధ్యత మున్సిపల్ అధికార యంత్రాగానికి లేదా అని ప్ర‌శ్నించారు. ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీయడం, చెక్ చేయడం, వాటర్ క్వాలిటీ చెక్ చేయడం ఇవన్నీ కూడా అధికారులు మ‌రిచిపోయార‌న్నారు. నిజంగా అదే జరిగుంటే సమస్య ఇందాకా వచ్చేది కాద‌ని,  ఈ ఘటనలో కొంత మంది అధికారులు సస్పెండ్ చేశామని చేతులు దులుపుకుంటే కాద‌న్నారు. కచ్చితమైన కారణాలు చెప్పకుండా ఫలానా అయ్యిండొచ్చు అని చెప్పడం బాధాక‌ర‌మ‌ని అన్నారు.  ఉన్న‌ట్లుండి ధూళిపాళ్ల అలా మాట్లాడ‌డంతో స‌ర్కార్ పెద్ద‌లంతా ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య పోయారు. ఏమీ మాట్లాడ‌కుండా మౌనంగా ఉండిపోయారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Ala Vaikuntapuramlo movie review 3.25/5

Read More →