బాబుకు కలిసిరాని `దుర్ముఖి`
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దుర్మిఖి నామ సంవత్సరం కలిసి రావడం లేదు. ఏడాది మొదలు అయినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనందుకు సంతోషపడాలో.. తమ్ముళ్ల మధ్య గొడవలతో పార్టీ పరువు పోతున్నందుకు బాధపడాలో అర్థం కాక బాబు తల పట్టుకుంటున్నాడు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం సరిగా సహకరించడం లేదు. అంతేకాదు.. కేంద్ర పథకాలన్నీ బాబు ఖాతాలో వేసుకుంటున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో బాబుపై కేంద్రం గుర్రుగా ఉంది. బాబు పంపిన లెక్కలను తిరిగి పంపుతోంది.. సరిచూసుకుని పంపించాలని ఆదేశాలు చేస్తోంది. పైగా ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని, కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను ప్రోతసహిస్తున్నాడని, రాజధాని ప్రాంతంలో భూ దందా విచ్చలవిడిగా సాగుతోందని, బాబు వచ్చి రెండేళ్లు కాకముందే ఒకటిన్నర లక్షల కోట్లు సంపాదించాడని `సేవ్ డెమోక్రసీ` పేరుతో ఢిల్లీ వెళ్లి బాబుపై కేంద్రానికి కంప్లైట్ చేస్తే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో పాటు బాబు లెక్కలపై ఆరాతీస్తున్నట్లు సమాచారం.
అంతేకాదు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, తెస్తామని టీడీపీ ఎన్నికల ముందు ప్రచారంలో చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పడంతో బాబుపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఇప్పుడు ఏం చేస్తారంటూ ప్రతిపక్షాలు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు రాకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుండడం.. దానిపై చంద్రబాబు నోరు మెదపకపోవడంపై బాబుకు ఏపీలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం చంద్రబాబుకు ఈ దుర్ముఖినామ సంవత్సరం కలిసిరాలేదనే చెప్పవచ్చు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.