Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Earthquake yesterday .. Katiya hurricane today .. flowing Mexico

By   /  September 10, 2017  /  Comments Off on Earthquake yesterday .. Katiya hurricane today .. flowing Mexico

    Print       Email

నిన్న భూకంపం .. నేడు కతియా హరికేన్.. అల్లాడుతున్న మెక్సికో..

నిన్నటికి నిన్న మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. దాని నుంచి తేరుకోక మునుపే కతియా హరికేన్ అల్లాడిస్తోంది. ఈ హరికేన్ గల్ఫ్ తీరం నుంచి మెక్సీకోకు చేరింది. మొదట్లో తీవ్రత రెండో స్థాయిలో ఉన్న ఈ హరికేన్‌ మెల్లగా బలహీనపడి ఒకటవ స్థాయికి పడిపోయింది. ఈ హరికేన్ ఎఫెక్ట్ తో వెరాక్రూజ్‌ స్టేట్ దగ్గరలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వెరాక్రూజ్‌, తూర్పు హిదాల్గో, ప్యూబ్లాలో సుమారుగా 15 అంగుళాల వర్షపాతం నమోదు కానుందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.

InCorpTaxAct
Suvidha

నిన్ననే మెక్సికోలో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.2గా నమోదు అయింది. దీని ప్రభావంతో పలు భవనాలు, ఇళ్ళు, స్కూళ్ళు, హాస్పిటల్స్ దెబ్బతిన్నాయి. 3.3 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఈ భూకంపం ధాటికి 61 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది గాయపడ్డారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →