Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

ED attaches Vijay Mallya’s properties and shares worth Rs 6,600 crore..

By   /  September 4, 2016  /  Comments Off on ED attaches Vijay Mallya’s properties and shares worth Rs 6,600 crore..

    Print       Email

vijay mallya 1మాల్యా ఆస్తులు జప్తు చేసిన ఈడీ

 

InCorpTaxAct
Suvidha

 

 

పలు బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయి పడిన లిక్కర్ డాన్ విజయ్‌మాల్యాపై చర్యలు ప్రారంభం అయ్యాయి. తాజాగా మాల్యాకు చెందిన రూ.6,600 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ముంబై, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లోని ఆయన ఆస్తులు అటాచ్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది. 2010లో వీటి విలువ ఆధారంగా జప్తు చేసినట్లు ఈడీ తెలియజేసింది. ప్రస్తుత ధరల ప్రకారం వీటి విలువ మార్కెట్‌ ఆధారంగా రూ.6,600 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.
ఈడీ అటాచ్‌ చేసిన మాల్యా ఆస్తుల్లో మహారాష్ట్రలో ఉన్న ఫామ్‌ హౌస్‌ కూడా ఉంది. దీని విలువ రూ.200 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. బెంగళూరులో రూ.800 కోట్లు విలువైన మాల్‌, అపార్ట్‌మెంట్‌ కూడా ఉన్నాయి. యూబీఎల్‌, యూఎస్‌ఎల్‌లోని రూ.3 వేల కోట్లు విలువైన వాటాలు ఉన్నాయి. బ్యాంకుల అప్పులు ఎగవేసేవారికి బలమైన సందేశం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →