Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Eid Mubarak

By   /  July 7, 2016  /  Comments Off on Eid Mubarak

    Print       Email

ramzanఈద్ ముబారక్ హో

 

InCorpTaxAct
Suvidha

 

రమజాన్ ప్రపంచంలోని ముస్లింలందరూ అత్యంత పవిత్రంగా భావించే పండుగ. నెల పాటు అన్ని నియమ నిబంధనలు పాటించి భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. బుధ‌వారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించగానే ఈద్ కా చాంద్ ముబారక్ హో’ (పండుగ శుభాకాంక్షలు) అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు యువకులు నగరంలోని పలు ప్రాంతాల్లో బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. నెల రోజులపాటు అన్ని నియమ నిబంధనలు పాటించి రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు అల్లాహ్‌కు కృతజ్ఞత చెల్లిస్తూ పండుగ చేసుకోనున్నారు. ఈమాసం సందర్భంగా నెల రోజులుగా ఎంతో పవిత్రంగా కొనసాగించిన ఉపవాస దీక్ష(రోజా)లు, తరావీ ప్రార్థనలు బుధ‌వారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముగిశాయి. పండుగ గురించి ప్రకటన వెలువడగానే ఆయా మసీదు కమిటీల ప్రతినిధులు రంజాన్ సామూహిక ప్రార్థనలకోసం ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి అత్తరు, పన్నీరు లాంటి సుగంధ ద్రవ్యాలతో ఈద్గాలో సమావేశమై సామూహికంగా అల్లాహ్‌కు కృతజ్ఞత చెల్లిస్తూ ‘ఈద్’ నమాజ్ చేయనున్నారు. తమ అపరాధాలను మన్నించాలని, సన్మార్గాన నడపాలని దువా చేయనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →