Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Election Commission shock to TTV Dinakaran

By   /  January 26, 2018  /  Comments Off on Election Commission shock to TTV Dinakaran

    Print       Email

ఎన్నికల ఖర్చుపై మెలిక.. దినకరన్‌పై ఈసీ అనర్హత వేటు?

 

InCorpTaxAct
Suvidha

 

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనాలకు నాంది పలికిన శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం ఎపిసోడ్ పూర్తయిన తర్వాత తెరపైకి సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లు ఎంట్రీ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లి రాజకీ ప్రక్షాళన చేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే జయలలిత నియోజకవర్గం ఆర్కేనగర్ లో జరిగిన ఉప ఎన్నికలో అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ అనూహ్యంగా గెలుపొందారు. అయితే ఆయన గెలుపుపై అధికార పక్షం, ప్రతిపక్షం పార్టీలు విమర్శలు చేస్తూన్న విషయం తెలిసిందే. ఆర్కేనగర్ ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టి అక్రమమార్గంలో గెలిపు సొంతం చేసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్‌పై ఎన్నికల కమిషన్‌(ఈసీ) అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. పరిమితి మించి ఎన్నికల ఖర్చు చేశారనే అనుమానంతో దినకరన్‌ సమర్పించిన లెక్కలకు ఈసీ ఆమోదం తెలపలేదు. ఒకవేళ ఈసీ విచారణలో పరిమితి మించి ఖర్చు చేసినట్లు తేలితే ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. దినకరన్ మరోసారి చిక్కుల్లో పడ్డట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →