వంద రోజుల పాటు ఉపాధి హామీకి ఏర్పాట్లు: మంత్రి జూపల్లి
వచ్చే మూడు నెలల్లో భారీగా ఉపాధి హామీ పనులు చేపట్టనున్నామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి ఒక్కరికి వంద రోజుల పాటు పనికల్పించేలా చర్యలు తీసుకోవాని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. మంత్రి జూపల్లి సీఎస్ ఎస్పీ సింగ్ తో కలిసి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.గత ఏడాది డబ్బు వేస్ట్ కాకుండా నిధులను సద్వినియోగం చేసిన అధికారులను ప్రశంసించారు.
అలాగే ఈ ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యాలను నిర్ధేశించారు. సీసీరోడ్లతో పాటు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. అక్టోబరు నాటికి తెలంగాణలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలని తెలిపారు. ఆ టైమ్ కలా బహిర్భూమి రహితంగా రాష్ట్రాన్ని మార్చాలని సూచించారు. దీనికోసం టార్గెట్లను నిర్ధేశించాలని సూచించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.