ఇంగ్లీష్ సమ్మర్ షెడ్యూల్స్ ప్రకటించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు..
వచ్చే ఏడాది జరగనున్న ఇంగ్లీష్ సమ్మర్ షెడ్యూల్ కు సంబంధించిన క్రికెట్ మ్యాచ్ ల షెడ్యూల్స్ ని ప్రకటించారు. ఈ షెడ్యూల్ ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇంగ్లిష్ సమ్మర్లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్టు పాల్గొంటాయి. అన్ని టీమ్ లతో ఇంగ్లండ్ జట్టు ఏడు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అలాగే 9 వన్డేలు, నాలుగు టీ20లు కూడా ఆడనుంది.
2018 మే 24న లార్డ్స్ మైదానంలో పాకిస్థాన్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌తో ఇంగ్లిష్ సమ్మర్ ఆరంభం కానుంది. సెకెండ్ టెస్ట్ మ్యాచ్ జూన్ 1న హెడింగ్లీలో జరగనుంది. అనంతరం స్కాట్లాండ్తో వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ జరగనుంది.
ఇక భారత్ తో జూలై 3 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. భారత్ తో 3 టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. మూడు నెలల భారత పర్యటన టీ20లతో ఆరంభం కానుంది. ఆ తర్వాత వన్డేలు చివరిగా టెస్ట్ సిరీస్ జరగనుంది.
ఇంగ్లిష్ సమ్మర్ షెడ్యూల్స్ ఇలా ఉన్నాయి..
జూలై 3 – తొలి టీ20 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
జూలై 6 – రెండో టీ20 – సోఫియా గార్డెన్స్, కార్డిఫ్
జూలై 8 – మూడో టీ20 – కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్
జూలై 12 – తొలి వన్డే – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్
జూలై 14 – రెండో వన్డే – లార్డ్స్, నాటింగ్‌హామ్
జూలై 17 – మూడో వన్డే – హెడింగ్లీ, లీడ్స్
ఆగస్టు 1-5 – తొలి టెస్ట్ – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 9-13 – రెండో టెస్ట్ – లార్డ్స్, లండన్
ఆగస్టు 18-22 – మూడో టెస్ట్ – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్
ఆగస్టు 30-సెప్టెంబరు 3 – నాలుగో టెస్ట్ – అజీస్ బౌల్, సౌతాంప్టన్
సెప్టెంబరు 7-11 – ఐదో టెస్ట్ – ది ఓవల్, లండన్
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.