Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0006.”రి యల్ మాస్టర్స్..!”

By   /  July 8, 2016  /  No Comments

    Print       Email

5835066-mdఓ ఐదు సంవత్సరాల పాప.. ఓ మహానగరంలో చింపిరి జుట్టుతో కేవలం ఒంటిమీద ఓ నీలిరంగు డ్రాయరుతో..పిచ్చిగా తిరుగుతూ ఆకలితో ఏడుస్తోంది..ఓ టూవీలర్ పైన వెళ్తున్న ఓ పెద్దాయన ఆ అమ్మాయిని గమనించి దగ్గరికి తీసి రోడ్డు పక్కకి జరిగి తన వాటర్ బాటిల్ లోంచి నీళ్ళు తాగించి అదే నీళ్ళతో ఆ తల్లి మొహం తుడిచి కర్చీఫ్ తో అద్ది..
” మీ అమ్మ నాన్నా ఎక్కడ..?!”ఆప్యాయంగా అడిగేసరికి ఆ పాపకి దుఃఖం ముంచుకొచ్చింది..పెద్దాయన ఒళ్లో ఒదిగి వాలుతూ తెలియదన్నట్టు సైగ చేసింది.
”సరే సరే..మరి మా ఇంటికి పోదాం వస్తావా చిట్టితల్లీ,,!”
అంతే వెంటనే ”ఊ..”అంటూ గట్టిగా చుట్టేసుకుంది.
ఆ పెద్దాయన ఒక రిటైర్డ్ టీచర్ పేరు గురునాథం….అతని శ్రీమతి ఆ చిన్ని పాపను చూసి ఆశ్చర్యపోతుంటే
” మనకు దేవుడిచ్చిన బిడ్డ..” చెప్పారాయన.
ఆ చిన్నతల్లిని ఆమె దగ్గరికి తీసుకుని ముద్దుచేసి ” ఇడ్లీ తింటావా బంగారూ..” అంటూనే తను తింటున్న ప్లేట్లోని ఇడ్లీని పాపకు తినిపిస్తూ..
”ఏమండీ ఈ వరాలతల్లిని వరలక్ష్మి అని పిల్చుకుందామండీ..”చెప్పింది పరమానదంగా భర్తతో..!
ఆమె పేరు కమల..ఆ దంపతులకు ఇద్దరాడపిల్లలు.పెళ్ళిళ్లై అత్తారిళ్ళ కెళ్ళారు..!
మరి ఇరవైరెండు ఏళ్ళు ఎలా గడిచిపోయాయో..ఇప్పుడు..
”వరలక్ష్మి” ఓ గైనకాలజిస్ట్ మరియు సర్జన్..”వరలక్ష్మి భర్త తన కొ మెడికో..డా.అమృతవర్ధన్..ఓ చిన్న పల్లెలో ఓ పెద్ద ఆసామి తనయుడు.మారుమూల ఆ చిన్న పల్లెలో ఇప్పుడు వారి హాస్పటల్..తనను కన్నబిడ్డ కన్నా మిన్నగా చూసుకున్న ఆ తల్లిదండ్రులకు కానుకగా ఇప్పుడామె ”శ్రీ గురుకమల ఫ్రీ మల్టీ స్పెషాలిటీస్” హాస్పటల్ సమర్పించింది.

 

InCorpTaxAct
Suvidha

 

Author: Madhavarao Koruprolu

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →