Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Even God is not safe in Chandra Babu government, says YS Jagan

By   /  August 19, 2016  /  Comments Off on Even God is not safe in Chandra Babu government, says YS Jagan

    Print       Email

ysjబాబు పాల‌న‌లో దేవుడికే ర‌క్ష‌ణ లేద‌ట‌

 

InCorpTaxAct
Suvidha

 

 

‘‘రాష్ట్రంలో పుష్కర కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయని, చాలా గొప్పగా చేస్తున్నామని చంద్రబాబు వెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని ఇక్కడికి పిలుచుకువస్తారు. కానీ ఇక్కడ ఏమాత్రం విచక్షణ లేకుండా బుల్డోజర్లు పెట్టి గుళ్లు, గోపురాలు కూల్చి వేస్తున్నారు. గుళ్లను ముట్టుకోవాలన్నా, గుడిలో దేవుళ్లను, శిలను ముట్టుకోవాలన్నా కమిటీతో మాట్లాడాలి. గుడిలో దేవుడ్ని తీసేటప్పుడు పూజలు చేయాలి. ఆ తర్వాత లాంఛనాలన్నీ పూర్తిచేయాలి. పక్కన గుడికట్టి ప్రతిష్టించాలి. అవేవీ ఇక్కడ జరగడం లేదు’’ అని  ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీలోని దేవుళ్ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌ని మండిప‌డ్డారు. పుష్కరస్నానాలకు వెళ్లి మృత్యువాత పడ్డ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం నందిగామ వెళుతూ మార్గమధ్యలో ఇబ్రహీంపట్నం వద్ద  ఆగిన‌వ వైయ‌స్ జ‌గ‌న్ ఇబ్రహీంపట్నం రింగువద్ద జాతీయ రహదారి పక్కన ఇటీవల అధికారులు కూల్చివేసి పునర్నిర్మాణం చేసిన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జ‌గ‌న్‌ మాట్లాడుతూ… జాతీయ రహదారి పక్కన ఉన్న గాంధీ విగ్రహం తమకు ఎటువంటి అడ్డుకాదని నేషనల్ హైవే అథారిటీ అధికారులు చెప్పినా తొలగించడం అన్యాయమన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మహాత్మ గాంధీకి సెక్యూరిటీ లేదు… రాజశేఖరరెడ్డి విగ్రహానికి సెక్యురిటీ లేదు… చివరికి దేవుళ్ల గుళ్లకు కూడా సెక్యూరిటీ లేదని జ‌గ‌న్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు గుళ్లు, గోపురాలు, దేవుళ్లంటే విశ్వాసంలేదని జగన్ మండిపడ్డారు. దేవుడి భూములు ముట్టుకోవాలంటే ఎంత పాపాత్ముడైనా నాలుగుసార్లు ఆలోచిస్తాడని… కానీ చంద్రబాబు గుడిని, గుళ్లో లింగాన్ని కూడా అమ్మేస్తున్నాడని దుయ్యబట్టారు. ‘‘సదావర్తి భూములు సాక్షాత్తు శివుడి భూములు. ఆ భూముల్ని ముట్టుకోవడానికి ఎవరూ సాహసించరు. రూ. వెయ్యికోట్లు అమ్మే భూములను రూ. 22 కోట్లకు తన బినామీలకు చంద్రబాబు దోచిపెట్టారన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →