Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Even Sakshi media is not able to comment on our efforts on Pushkaraalu, says Babu

By   /  August 18, 2016  /  Comments Off on Even Sakshi media is not able to comment on our efforts on Pushkaraalu, says Babu

    Print       Email

chandrababuబాబుకు సాక్షి కితాబు!

 

InCorpTaxAct
Suvidha

 

 

త‌మ‌పై ఎప్పుడు వ్య‌తిరేక వార్త‌లు రాసే సాక్షి కూడా పుష్క‌ర ఏర్పాట్ల‌పై వ్య‌తిరేక వార్త‌లు రాయ‌లేక‌పోతోంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఏపీ రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలోని ప్ర‌ముఖ ధ్యాన బుద్ధ ఘాట్‌ను సందర్శించిన ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. సాక్షి ప‌త్రికలో పుష్క‌రాల‌కు సంబంధించి పాజిటివ్ వార్త‌లు వ‌స్తున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. సాక్షి లాంటి పత్రిక కూడా పుష్కరాల ఏర్పాట్లపై వ్యతిరేకంగా వార్తలు రాయలేక పోతోందని అన్నారు. ప్ర‌భుత్వం ఆ విధంగా అద్భుత‌మైన ఏర్పాట్లు చేసింద‌ని చెప్పారు. సాక్షికే దొర‌క‌నంత ప్లానింగ్‌తో ప్ర‌భుత్వ పుష్క‌రాల‌ను నిర్వ‌హిస్తోంద‌న్నారు. పుష్కర ఏర్పాట్లకు సంబంధించి జనం సంతృప్తిగా ఉన్నారని సీఎం చెప్పారు. అయితే, తాము , ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను, పుష్క‌ర ఏర్పాట్ల‌ను, సీఎం ప‌నితీరును, అధికారుల చ‌ర్య‌ల‌ను ఎంత‌గా హైప్ చేసి రాసినా.. సీఎం చెప్ప‌లేదని, మాట వ‌ర‌స‌కైనా పొగ‌డ‌లేద‌ని.. ఇదే మీటింగ్‌లో ఉన్న ఓ పెద్ద ప‌త్రిక‌, మ‌రో ద‌మ్మున్న ప‌త్రిక‌ల ప్ర‌తినిధులు నిట్టూర్చార‌ట‌..!
సీఎంకి పొరుగింటి పుల్ల కూరే రుచిగా ఉంద‌ని త‌మ స‌హ‌చ‌రుల‌తో కామెంట్లు కూడా చేశార‌ట‌. ఇదండీ ప‌రిస్థితి. అయిన వాళ్ల పొగ‌డ్త‌ల క‌న్నా కానివాళ్ల మెచ్చుకోలే బాగుంటుంది క‌దా..! ఏదేమైనా సీఎం చంద్ర‌బాబుపై సాక్షి భ‌లే ప్ర‌భావం చూపిస్తోంది!! ఇంత బిజీలోనూ దానిని ఆయ‌న మ‌రిచిపోలేకుండా ఉన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →