Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Ex-engineering student emerges as Wani’s successor in Hizbul video..

By   /  August 18, 2016  /  Comments Off on Ex-engineering student emerges as Wani’s successor in Hizbul video..

    Print       Email

Burhan Waniతెరపైకి బుర్హాన్ వనీ వారసుడు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో హిజ్‌బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ హతమైన విషయం తెలిసిందే. తాజాగా అతని వారసుడుని అంటూ ఓ వ్యక్తి తెరపైకి వచ్చాడు. వనీ వారసుడిగా జకీర్ రషీద్ భట్ అనే యువకుడు తనను తాను ప్రకటించుకున్నాడు. ఈ మేరకు.. యూట్యూబ్‌లో 8 నిమిషాలు నిడివి గల ఒక మెసేజ్ ని పోస్ట్ చేశాడు.అంతేకాదు.. వనీ హతం తర్వాత కశ్మీర్ లో చెలరేగిన అల్లర్లను మరింత విజయవంతం చేయాలని పిలుపు నిచ్చాడు.
పోలీసు రిక్రూట్‌మెంట్లకు కశ్మీర్ యువకులు దూరంగా ఉండాలని కూడా పిలుపునిచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాడు. ఈ ప్రయత్నాలను కశ్మీర్ ప్రజలు అందరూ సమష్టిగా తిప్పికొట్టాలన్నాడు. పుల్వామా జిల్లా ట్రాల్‌లోని నూర్‌పోర గ్రామానికి చెందిన 22 ఏళ్ల రషీద్ భట్ 2013లో హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌లో చేరాడు.

భట్ ఉగ్రవాద సంస్థలో చేరకముందు ఛండీగఢ్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. భట్ తండ్రి జమ్మూకశ్మీర్ ప్రభుత్వ శాఖలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అయితే.. కశ్మీర్‌లో జరుగుతున్న వేర్పాటువాద ఉద్యమాన్ని స్వాంతంత్ర్య పోరాటంగా వీడియోలో భట్ అభివర్ణించాడు. అంతేకాకుండా..ఉగ్రవాది వనీని ‘అమరవీరుడు’గా కీర్తించాడు. వనీ ప్రాణత్యాగం చేసి కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటానికి కొత్త ఊపిరులూదారని అన్నాడు. కశ్మీర్ లో ఆందోళనలు విరమించాలని ఎవరు కోరినా.. అల్లా ఆదేశాలను అనుసరించి అందరూ తిప్పికొట్టాలని వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →