వైట్ హౌస్ లో సరైన భద్రత లేదు: మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్
కొద్దికాలం క్రితం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి ఓ దుండగుడు గోడ దూకి ప్రవేశించాడు. అక్కడే దాదాపుగా పావుగంటపాటు సంచరించాడు. అతన్ని గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై సీక్రెట్ సర్వీస్ మాజీ ఏజెంట్ డాన్ బొంగినో స్పందించారు. ట్రంప్ కు వైట్ హౌస్ ఏ మాత్రం సురక్షితమైంది కాదని అభిప్రాయపడ్డారు.పొరపాటున ఉగ్రవాద దాడి జరిగితే ఆయన్ను ఎవరూ కాపాడలేరని అన్నారు. వైట్ హౌస్ లో సరైన విధులు నిర్వహించే వారు లేరని అన్నారు. పొరబాటున ఉగ్రదాడి జరిగితే ఏం చేయగలరని ప్రశ్నించారు.
కొద్దికాలం క్రితం వైట్ హౌస్ లోకి ఎంటర్ అయిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ టీ ట్రాన్ గా అధికారులు గుర్తించారు. అతడు రాత్రి 11.21 సమయంలో ప్రవేశించారు. దాదాపుగా 11.38కి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ అక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అక్కడ ఉంటున్న సమయంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.