Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Farooq Abdullah sensational comments on Kashmir issue

By   /  July 22, 2017  /  Comments Off on Farooq Abdullah sensational comments on Kashmir issue

    Print       Email

కశ్మీర్ అంశంలో ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

 

కశ్మీర్ అంశంలో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆయన పార్లమెంటు దగ్గర మీడియా సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడవ వ్యక్తి అవసరం ఉందని అన్నారు. ఈ సమస్య సుదీర్ఘ కాలంగా ఉందన్నారు. మూడవ వ్యక్తి జోక్యంతో సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కశ్మీర్ అంశంలో అమెరికా, చైనా మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వచ్చినా మనం మాత్రం స్పందించడం లేదన్నారు. భారత్ , పాక్ దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయని అన్నారు. దీనివల్ల ఎంతమంది చనిపోవాలని ప్రశ్నించారు.

కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఐక్యరాజ్యసమితిలో యూఎస్ రాయబారి నిక్కీ హేలీ మాత్రం మధ్యవర్తిత్వానికి ట్రంప్ రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక డోక్లాం నేపథ్యంలో పాకిస్థాన్ తరపున యుద్ధం చేసేందుకు సిద్దంగా ఉన్నామని చైనా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాలు నేరుగా కశ్మీర్ అంశం గురించి మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →