Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Fear of immigration to Congress..

By   /  February 12, 2016  /  Comments Off on Fear of immigration to Congress..

    Print       Email

Telangana Congress leaders

కాంగ్రెస్ కు తప్పని వలసల భయం..!
తెలంగాణ టీడీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు కారెక్కేశారు. దీంతో మరో విపక్ష పార్టీ కాంగ్రెస్ కు కూడా వలసల భయం పట్టుకుంది. తమ పార్టీ నుంచి కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు జంప్ కొడుతున్నారా..? అన్న కోణంలో ఆ పార్టీ నేతల్లో అనుమానాలు మొదలయ్యాయని సమాచారం. దీంతో.. వెళ్ళడం అంటూ జరిగితే.. ఎవరెవరు కారెక్కే అవకాశం ఉందనే అంశంపై చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ శ్రేణులు.. ఇతర పార్టీల నుంచి కూడా ఎవరైనా వస్తారా అన్న కోణంలో ఆరా తీస్తున్నాయని రాజకీయ వర్గాల సమాచారం.

InCorpTaxAct
Suvidha

గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలబడింది. దీంతో టీడీపీ నేతలు నడచిన బాటలో తమ పార్టీ నేతలు కూడా నడిచే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేతల్లో భయం పట్టుకుందని సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌ (డోర్నకల్‌), యాదయ్య (చేవెళ్ల), కనకయ్య (ఇల్లెందు), విఠల్‌ రెడ్డి (ముథోల్‌) కారెక్కేశారు. అయితే రీసెంట్ గా టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా మరికొందరు నేతలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ నేతల్లో కూడా గుబులు మొదలైందని తెలుస్తోంది.

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో హస్తం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు.. తమ పార్టీ భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. దీంతో పలువురు నేతలు అధికార పార్టీతో టచ్ లో ఉన్నారని వారికి సమాచారం అందిందట. దీంతో కాంగ్రెస్ నుంచి కూడా టీఆర్ఎస్ లోకి వలసలు ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ ముఖ్య నాయకుడు గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారట. ఇదిలాఉంటే.. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు టైమ్ ఉండటంతో.. వేచి చూసే ధోరణిలో తమ పార్టీ నేతలు ఉన్నారని కొంతమంది కాంగ్రెస్ నేతలు బాహాటంగానే చర్చించుకుంటున్నట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →