Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Few changes in Amaravathi Master Plan

By   /  February 23, 2016  /  Comments Off on Few changes in Amaravathi Master Plan

    Print       Email

budda - amaravathi

అమరావతి మాస్టర్ ప్లాన్ లో స్వల్ప మార్పులు..?

InCorpTaxAct
Suvidha

 

ఏపీ రాజధాని అమరావతి తుది మాస్టర్ ప్లాన్ ను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ రిలీజ్ చేశారు. రహదారులపై అభ్యంతరాలు వచ్చాయన్నారు. అయితే వాటిని అన్నింటినీ పరిష్కరించామని వెల్లడించారు. రహదారుల నిర్మాణంలో ఇళ్లు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. స్వల్ప మార్పులతో అమరావతి మాస్టర్‌ప్లానును ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ రిలీజ్ చేశారు. ఉత్తర దక్షిణ దిశలుగా ఉండే ఐదురోడ్లు, తూర్పు పడమరలుగా ఉండే ఒకరోడ్డును కొద్దిగా అటూ ఇటూ జరిపారు. దీంతోపాటు నీరుకొండ దగ్గర ఏర్పాటు చేయాలనుకున్న రిజర్వాయర్‌ స్థలాన్ని, కొండవీటివాగు, పాలవాగు ప్రవాహ ప్రాంతాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. ప్రస్తుత ప్లాన్‌లో గ్రామాల మీదుగా రోడ్లు వెళ్లడాన్ని దాదాపుగా నివారించామని నారాయణ చెప్పారు. ఉండవల్లి గ్రామంలో గతంలో నాలుగురోడ్లను ప్రతిపాదించి వాటిని ఎత్తేశారు. అయితే సీడ్‌ డెవపల్‌మెంట్‌ ఏరియా ఉన్న మందడంలో మాత్రం రోడ్లను మార్చలేదు. రాయపూడి, తాళ్లాయపాలెం దగ్గర ఉన్న సీడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా రోడ్లను స్వల్పంగా తూర్పుదిశకు మార్చారు. దీనివల్ల నష్టాన్ని చాలా వరకూ తగ్గించవచ్చన్నారు.

తుళ్లూరు తూర్పుభాగంలో ఉత్తర, దక్షిణ దిశలుగా ఉన్న రోడ్డును తూర్పు వైపుగా మార్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అయితే తూర్పు, పడమరలుగా ఉన్న రోడ్డును మాత్రం అలాగే ఉంచేశారు. సీఎం నివాసం నుంచి పెనుమాక వరకూ వేసిన 150 అడుగుల రోడ్డును పూర్తిగా ఎత్తేశారు. కృష్ణాయపాలెం దగ్గర రోడ్డును డ్రాఫ్ట్‌లోంచి తొలగించారు. అలాగే సీడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో ఉన్న మందడం, ఉద్దండ రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో రైతులకు గతంలో ఎక్స్‌ప్రెస్‌ రహదారికి దక్షిణంగా కేటాయించిన ప్లాన్ ను ఉత్తరం వైపుకు కొద్దిగా మార్చారు. వాణిజ్య ప్రాంతాల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. ఐనవోలు గ్రామంలో ప్లాన్ ను అలాగే ఉంచారు. ల్యాండ్‌ పూలింగ్ నోటిఫికేషన్‌ను 28వ తేదీ నుంచి జారీచేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. 30 రోజుల అనంతరం గడువు తీరిన తర్వాత ప్లాట్లు కేటాయిస్తామన్నారు. రాజధాని ప్రాంతం నుంచి ఎయిమ్స్‌కు వెళ్లేందుకు వీలుగా నవులూరు మధ్యలో నుంచి రోడ్డును వేశారు. అయితే అక్కడ 15 ఇళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. వారికి అవసరమైన పరిహారం కేటాయిస్తామన్నారు. ఇంకా పూలింగుకు ఇవ్వాల్సిన భూమి మొత్తం 1200 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. ఇప్పటికీ పూలింగుకు ఇచ్చేందుకు అవకాశముందని.. లేకపోతే సేకరణ పద్ధతిలో తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →