Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Fight For New Districts – Strategy by D K Aruna

By   /  September 5, 2016  /  Comments Off on Fight For New Districts – Strategy by D K Aruna

    Print       Email

arunaడీకే అరుణ పోరుబాట‌!

కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో గద్వాల్.. జనగామ జిల్లాలు లేకపోవటం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు జిల్లా అయ్యే అవకాశం మిస్ అయితే.. మళ్లీ ఇంకెప్పటికీ సాధ్యం కాదన్న ఆందోళన అక్క‌డి నేత‌ల్లో ప్ర‌జ‌ల్లో వ్యక్తమవుతోంది. అందుకే.. పోరుబాటతో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే అరుణ ఉన్నారు. అందుకే ఈ వ్యవహారం మీద ఆమే స్వయంగా రంగంలోకి దిగారు. డీకే అరుణకు తోడుగా.. జనగామ జిల్లా డిమాండ్ ను మీద వేసుకున్న మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా దీక్ష బాట పడుతున్నారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉండటంతో పాటు.. అడ్డగోలుగా చేస్తున్నారన్న విమర్శను వారు బలంగా వినిపిస్తున్నారు. అన్ని సౌకర్యాలు.. భౌగోళిక సౌలభ్యం.. చారిత్రక నేపథ్యం ఉన్న గద్వాలను జిల్లాను చేయాలన్న డిమాండ్ తో పాటు.. అదే విధంగా జనగామను జిల్లా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ.. దీక్ష చేపడుతున్నారు.

InCorpTaxAct
Suvidha

రెండు కొత్త జిల్లాల మీద చేస్తున్న నిరసన దీక్షతో భావోద్వేగాన్ని రగిలించి కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయాలని డీకే అరుణ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రెండు జిల్లాల ఏర్పాటు మీద పలు వాదనలు వినిపించినా.. వాటిని జిల్లాలుగా చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా లేరనేది బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మాచారం. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో డీకే అరుణ‌, పొన్నాల ల‌క్ష్మ‌య్యల దీక్ష‌లు ఎంత‌వ‌ర‌కు స‌ఫ‌లీకృత‌మ‌వుతాయ‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →