అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు అభిమానులకు సోషల్మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
‘స్వేచ్ఛ వెలకట్టలేనిది. దాన్ని గౌరవిద్దాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’– మహేశ్ బాబు
‘నా స్నేహితులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’– అక్కినేని నాగార్జున
‘తిప్పరా మీసం..భారత్ .. గర్వించాల్సిన క్షణం’– రామ్
‘భారత జాతీయ జెండా మరింత పైకి ఎగరాలి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’– రామ్ చరణ్
‘జై హింద్! స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’– అమితాబ్ బచ్చన్
‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’– ఎన్టీఆర్
‘స్వేచ్ఛ మన హక్కు. ఈ హక్కుని మనకు కల్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు స్మరించి వారికి సెల్యూట్ చేద్దాం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’– కల్యాణ్ రామ్
‘కేవలం కొత్త సంవత్సరాల్లో మాత్రమే కొత్త నిర్ణయాలు తీసుకోవడం కాదు. మన స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా ఓ కొత్త నిర్ణయం తీసుకోవాలి. సమాజం కోసం ఏదైనా చేద్దాం’– తాప్సి
‘ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం. మన దేశానికి సెల్యూట్ చేద్దాం’- తమన్నా
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.