బీజేపీకి బాబు ప్రశ్నల వర్షం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి ప్రశ్నల వర్షం కురిపించాడు. మాట ఇచ్చితప్పుకుంటే సరిపోదని, ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలని నెరవేర్చాలన్నారు. విజయవాడలో పార్టీ ఎంపీలతో సమావేశం అనంతరం బాబు మాట్లాడుతూ బీజేపీకి పలు ప్రశ్నలు సంధించారు. హోదాపై బాబు ఏమన్నారంటే… కాంగ్రెస్ పార్టీ ఏపీకి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు..కాదు 10 ఏళ్లు ఇవ్వాలని నాడు బీజేపీపట్టుబట్టిన విషయాన్ని గుర్తుచేస్తూనే అసలు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం 14వ ఆర్థిక సంఘానికి లేదన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర భవిష్యత్తుకు సంబందించినదని జీవన్మరణ సమస్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సహకరించిన బీజేపీకి రాష్ట్రన్ని ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయంతో నష్టపోయిన ర్రాష్టాన్ని ఆదుకుంటారన్నా నమ్మకంతోనే ప్రజలు బీజేపీకి కేంద్రంలో పట్టం కట్టారన్నారు. ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టాలకు దేశంలోని అనేక పార్టీలు మద్దతు తెలుపుతున్నా కేంద్రం నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
ఐదుకోట్ల ప్రజల భవిష్యత్తులో ముడిపడివున్నందున ప్రత్యేక హోదా వీలైనంత త్వరగా ప్రకటించాలని డిమాండ చేశారు. విభజన జరిగిన రెండు సంవత్సరాలైనా రెండు ర్రాష్టాల మధ్య అనేక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం అలసత్వం వహిస్తోందన్నారు. నియోజకవర్గాల పునర్ విభజన అంశానికి రెండు రాష్ట్రాలు అంగీకరించినా అటార్నీ జనరల్ పేరుతో దాన్ని ప్రక్కన పెట్టారన్నారు. అధికారిక సంఘం సిఫార్సులతో ర్రాష్టాలకు ఇచ్చిన నిధులకంటే ఏపీకి ఎక్కువే ఇచ్చామని జైట్లీ చెప్పిన విషయం వాస్తవం కాదన్నారు. నిధుల మంజూరు విషయంలో కేంద్రం చెబుతున్న లెక్కలు నిజం కావన్నారు. అన్ని ర్రాష్టాల మాదిరిగానే ఎపి అన్ని రకాల పన్నులను కేంద్రానికి కడుతోందని, అయితే కేంద్రం మాత్రం ఏపీపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ప్రధాన మంత్రి మోదీని కలిసి ఈరెండు సంవత్సరాల్లో ర్రాష్టానికి జరిగిన అన్యాయం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై చర్చిస్తామని చంద్రబాబు తెలిపారు.
ఏపీ ప్రజలు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ విషయంలో కొందరు ప్రజలను తప్పుదారి పట్టించి శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారన్నారు. కేంద్రం నెరవేర్చాల్సిన హామీలపై ఢిల్లీలో ఆందోళన చేస్తే మంచిదని రాష్ట్రంలో బంద్‌లు చేస్తే ఏ ప్రయోజనం కలగదన్నారు. కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేయడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.