Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Fire accident in China.. 22 died..

By   /  July 17, 2017  /  Comments Off on Fire accident in China.. 22 died..

    Print       Email

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 22 మంది సజీవ దహనం..

 

EIS
EnGeniusInc

 

 

చైనాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జియాంగ్సూ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. అక్కడి చాంషూ సిటీలో ఓ ఇంట్లో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. దీంతో మంటలు వేగంగా సమీంలోని నివాసాలకు కూడా వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో 22 మంది సజీవదహనమయ్యారు. అయితే ప్రమాదం సంభవించడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →