Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Fires in Portugal Forest.. 43 died..

By   /  June 19, 2017  /  Comments Off on Fires in Portugal Forest.. 43 died..

    Print       Email

పోర్చుగల్ ఫారెస్ట్ లో చెలరేగిన మంటలు.. 43 మంది మృతి..

 
పోర్చుగల్‌లోని ఓ అడవిలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఇవి భారీఎత్తున వ్యాపించి రోడ్డు పక్కనే ఉన్న కార్లను కూడా బుగ్గి చేసింది.ఈ ప్రమద ఘటనలో ఏకంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో అధికంగా కారులో కూర్చున్న వాళ్లే ఉన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏకంగా 160 ఫైర్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 500 మంది సిబ్బంది శ్రమిస్తున్నారు.
గత కొన్నేళ్ళుగా ఇలాంటి ప్రమాదాన్ని తాము చూడలేదని ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టా వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. అధికారులు ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్థులను ఖాళీ చేయించారు.అయితే నష్టం వివరాలు ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది కార్చిచ్చు వల్ల దాదాపు లక్ష ఎకరాల్లోని అడవి కాలి బుగ్గి అయిపోయింది.

EIS
EnGeniusInc
Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Biggest scam in Palamuru-RangaReddy project, criticises Nagam Janardhan Reddy

Read More →