Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Flying Car Will come soon

By   /  April 30, 2017  /  Comments Off on Flying Car Will come soon

    Print       Email

త్వరలో మార్కెట్ లోకి ఫ్లయింగ్ కారు..?
ఈ రోజుల్లో బైకులు , కార్లు సహజం అయిపోయాయి. మధ్యతరగతి కుటుంబాలు కూడా వీటిని మెయిన్ టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో వీటి సరసన ఓ చిన్న కారు లాంటి విమానం రాబోతోంది. ఇక నుంచి దానిపై ఎక్కి ఎగురుతూ వెళ్ళొచ్చు. అలా వింతగా చూడకండి. ఇది నిజమే.. కాకాపోతే దీనికి మరికొంత సమయం పట్టవచ్చు. కాని దీన్ని ఇప్పటికే తయారు చేసేశారు. కిట్టిహక్ అనే స్టార్టప్ సంస్థ కాలిఫోర్నియా కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఫ్లయింగ్ కార్ ని డెవలప్ చేసింది. అంతేకాదు ఈ కారు ఎలా పనిచేస్తుందో ఓ వీడియో ద్వారా వివరించింది. త్వరలోనే ఈ ఫ్లయింగ్ కార్లు అదందరికి అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఇలా అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ కారు మోడల్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.
ఈ సంస్థ ప్రయత్నానికి తమ పూర్తి సహకారం ఉంటుందని గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీపేజ్ కూడా తెలిపారు.అయితే కిట్టి సంస్థ దీన్ని మరికొన్నిసార్లు టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని భావిస్తోంది. దీనికి 8 రోటర్స్ ఉంటాయట. ఇంచుమించు పది పౌండ్లు బరువు ఉంటుందట. దీనిపై అత్యంత వేగంగా వెళ్ళవచ్చు అని తెలుస్తోంది. త్వరలో పరీక్షలు పూర్తి చేసి అందరికి అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని కిట్టిహక్ స్టార్టప్ సంస్థ తెలిపింది.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Negativity and Positivity

Read More →