లోక్ సభ మాజీ స్పీకర్ పి.ఏ.సంగ్మా కన్నుమూత..
లోక్ సభ మాజీ స్పీకర్ పి.ఏ.సంగ్మా కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన స్వగృహంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. సంగ్మా 1947, సెప్టెంబర్ 1వ తేదీన జన్మించారు. 1988 నుండి 1990 వరకు మేఘాలయ సీఎంగా పనిచేశారు. 1996-1998 వరకు 11వ లోక్ సభ స్పీకర్ గా దేశానికి సేవలందించారు. ఎనిమిది సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన సంగ్మా.. ప్రస్తుతం మేఘాలయలోని తురా (ఎస్టీ) నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. 2012లో రాష్ట్రపతి పదవి కోసం ప్రణబ్ ముఖర్జీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన కుమార్తె అగాంధ సంగ్మా 15వ లోక్ సభకు ఎంపికై యూపీఏ హాయంలో మంత్రిగా పనిచేశారు. సంగ్మా కుమారుడు కోర్నాడ్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నేతగా పనిచేస్తున్నారు. పి.ఏ సంగ్మా మృతి పట్ల లోక్ సభ సంతాపం తెలియజేసింది. అంతేకాదు.. సంతాపంగా ఈ నెల 8 వరకు సభను వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
లోక్సభ మాజీ స్పీకర్ సంగ్మా మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. లోక్సభ స్పీకర్గా ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. సంగ్మా ఈశాన్య ప్రజల గొంతుకగా నిలిచారన్నారని అన్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులు కూడా సంతాపం ప్రకటించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంగ్మా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సుజనాచౌదరి, బండారు దత్తాత్రేయ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంగ్మా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.