కొందరు ఆప్ నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు..
ఆప్ కి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఫిరోజ్ పూర్ శాఖ మాజీ కన్వీనర్ అమన్ దీప్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలు ఢిల్లీకి చెందిన 52 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.2016 డిసెంబరులో ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు భద్రత కల్పిస్తామని ఆప్ చెప్పిందన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిందన్నారు. కేజ్రీవాల్ మహిళల భద్రత గురించి చాల గొప్ప గొప్ప హామీలు ఇచ్చారని అన్నారు. వాస్తవానికి ఆప్ లో సైతం మహిళలకు భద్రత కరువైందన్నారు.
గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని అమన్ దీప్ కౌర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ నేతలు కొందరు తనను దూషించారని తెలిపారు. ఈ విషయాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ శిశోడియాకు, ఏఏపీ నేత సంజయ్ సింగ్కు తెలిపానన్నారు. దీనికితోడు కేజ్రీవాల్ నివాసం ముందు ధర్నా కూడా చేపట్టానన్నారు. అయితే తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కొంతమంది ఆప్ నేతలు 52 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ బాధితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. మిగిలిన 51 మంది పేర్లను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.