నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కోయిరాల కన్నుమూత
నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా(79) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. రేపు కోయిరాల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపట్ల భారత ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. సుశీల్ భారత్ కు మంచి స్నేహితుడని కొనియాడారు. నేపాల్ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.
సుశీల్ కొయిరాలా జీవిత విశేషాలు..
* 1939 ఆగస్టు 12న సుశీల్ కొయిరాలా భారత్‌లోని బనారస్‌లో బోధ్ ప్రసాద్ కొయిరాలా – కుమినిధి దంపతులకు జన్మించారు.
* సుశీల్ కొయిరాలా వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉన్నారు.
* 1954లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన.. ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు ఆకర్షితులై నేపాలీ కాంగ్రెస్‌లో చేరారు.
*1960లో నేపాల్‌ను స్థానిక రాజు ఆధీనంలోకి తీసుకున్నారు.దీంతో సుశీల్ కొయిరాలరే 16 ఏళ్ల పాటు రాజకీయ బహిష్కరణకు గురయ్యారు.
*1973లో విమానం హైజాక్‌కు సంబంధించి సుశీల్ కొయిరాలాకు సంబంధాలు ఉన్నాయని రుజువు అయింది.దీంతో ఆయన భారత్‌లో 3 ఏళ్ళపాటు జైలు శిక్ష అనుభవించారు.
* 2010లో నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
*2013 ఎన్నికల్లో నేపాల్‌లో కొయిరాలా ఆధ్వర్యంలో నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
*2014 ఫిబ్రవరి 11 నుంచి 2015 అక్టోబర్ 12 వరకు సుశీల్ కోయిరాల నేపాల్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
* కోయిరాల ఆధ్వర్యంలో నేపాల్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య బద్ధమైన కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
* కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో సుశీల్ 2015 అక్టోబరులో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
*2014 జులైలో సుశీల్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.