Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Four MLAs and MLC Joins in TDP Party at Vijayawada..

By   /  February 23, 2016  /  Comments Off on Four MLAs and MLC Joins in TDP Party at Vijayawada..

    Print       Email

YCP MLAS JOINS IN TDP new

వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు..!

InCorpTaxAct
Suvidha

 

వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సోమవారం టీడీపీలో చేరిపోయారు. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ సోమవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కూడా టీడీపీలో చేరారు.

వైసీపీ నేతలు టీడీపీలో చేరడానికి ముందు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు పొలిటికల్ హై డ్రామా నడిచింది. ఉదయం హైదరాబాద్ లో జరిగిన పీఏసీ సమావేశంలో భూమా నాగిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం తన కుమార్తె అఖిల ప్రియతో కలిసి విజయవాడ బయలుదేరి వెళ్ళారు. మరోవైపు.. విజయవాడలో కలెక్టర్ల సమావేశంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లంచ్ అవర్ లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో భేటీ అయి టీడీపీలో చేరికలపై చర్చించారు. ఈ అంశంపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు అనుమతి లభించగానే రాజకీయ పరిణామాలు మరింత వేగవంతం అయ్యాయి.ఇలోగా జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు, కర్నూలు జిల్లా నుంచి శిల్పా బ్రదర్స్ ఆయన అనుచరులు పార్టీ హై కమాండ్ పిలుపు మేరకు బెజవాడ చేరుకున్నారు.

కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే రామసుబ్బారెడ్డి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కోసం సంవత్సరాల తరబడి ఎలా కష్టపడిందీ వివరించారు. ఎవరితో పోరాడామో వారినే పార్టీలో చేర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. మీ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా చూస్తానని చెప్పారు. దీంతో కొత్తవారికి రాకకు రామసుబ్బారెడ్డి అంగీకారం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఊపిరి ఉన్నంతవరకు చంద్రబాబుతోనే ఉంటానని తేల్చి చెప్పారు. పార్టీ బలోపేతం కోసం అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రామసుబ్బారెడ్డితో భేటీలో పాల్గొన్న సమయంలో చంద్రబాబు వెంట ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల, దేవినేని ఉమా, కింజరపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర ఉన్నారు.

టీడీపీలో చేరిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో నంద్యాల నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి టీడీపీలో చేరామన్నారు. వైసీపీలో కొనసాగితే.. తమకు భవిష్యత్తు కనిపించడం లేదని తెలిపారు. తమ కార్యకర్తలు కూడా విసిగిపోయారని వ్యాఖ్యానించారు. వారు కూడా పార్టీ మారేందకు మొగ్గు చూపారని అన్నారు. తాను పదవి ఆశించి పార్టీ మారలేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తాను పదవి కావాలనుకుంటే ఇన్నాళ్ళూ ప్రతిపక్షంలో ఉండేవాడినే కాదన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు.ఆరు నెలల క్రితమే టీడీపీలోకి వద్దామనుకున్నామని.. అయితే కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైందన్నారు. రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించాలని చంద్రబాబును కోరామన్నారు. తమకు సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అమరావతి శంకుస్థాపనకు జగన్ రాకపోవడం అన్యాయమన్నారు. జగన్ ఆలోచనా ధోరణి సరిగా లేదని అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొతామనడం చాలా అన్యాయమని చెప్పారు. అందుకే నిరసనగానే తాము పార్టీని వీడి టీడీపీలో చేరామన్నారు. తాము చేసింది మొదటి తిరుగుబాటు అన్నారు. ఇంకా చాలా మంది టీడీపీలోకి వలసలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ప్రకటించారు. తమ నియోజక వర్గంలో ఉన్న మైనార్టీల సమస్యలను ముఖ్యమంత్రికి వివరించామని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. ఓవరాల్ గా నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ సైకిల్ ఎక్కేశారు. దీంతో రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లు అయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →