మంత్రివర్గ కూర్పు వెనుక మోదీ భారీ కసరత్తు..
ప్రధాని మోదీ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు భారీ కసరత్తే చేశారు. 2019 ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన పెద్ద రాష్ట్రాలు అయిన యూపీ, బీహార్ లపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే ఈ రెండు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు రాబట్టుకోవాలి. గత ఎన్నికల్లో యూపీలో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో మొత్తం 73 స్థానాలు దక్కించుకున్నారు. అలాగే బీహార్ లో కూడా పెద్ద సంఖ్యలో సీట్లు సాధించారు.
ఇదే పరంపర కొనసాగాలంటే ఈ రెండు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి అవసరం అని మోదీ భావిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులను తీసుకున్నారు. యూపీ నుంచి శివప్రతాప్ శుక్లా, సత్యపాల్సింగ్లను తీసుకున్నారు. అలాగే ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి పదోన్నతి కల్పించారు. ఇక బీహార్ నుంచి అశ్వని కుమార్ చౌబే, రాజ్‌కుమార్‌సింగ్ లకు కేంద్ర మంత్రిపదవులు కట్టబెట్టారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.