Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Frazzled Sunrisers squeeze home in last-ball thriller

By   /  April 13, 2018  /  Comments Off on Frazzled Sunrisers squeeze home in last-ball thriller

    Print       Email

ఉత్కంఠ పోరులో స‌న్‌రైజ‌ర్స్ గెలుపు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* చివ‌రి బంతికి బౌండ‌రీ బాదిన బిల్లీ స్టాన్లేక్‌

* మార్కండే రాణించిన ముంబైకి ఓట‌మి త‌ప్ప‌లేదు

డెక్క‌న్ అబ్రాడ్‌: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీని ఖాతాలో వేసుకుంది. చివరి బంతి వరకూ విజయం దోబూచులాడిన మ్యాచ్‌లో పదకొండో నెంబర్ బ్యాట్స్‌మెన్ బిల్లీ స్టాన్లేక్ ఆఖరి బంతికి బౌండరీ బాది విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన దశలో దీపక్ హుడా (25 బంతుల్లో 32 నాటౌట్) బ్యాట్ ఝళిపించి హైదరాబాద్‌ను గెలిపించాడు.  యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే 4 వికెట్లతో రాణించినప్పటికీ.. బుమ్రా, ముస్తాఫిజుర్ మెరిసినప్పటికీ.. ముంబైకి ఓటమి తప్పలేదు.148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు ధావన్ (28 బంతుల్లో 45), సాహా(22) చక్కటి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలో 62 పరుగులు జోడించారు.

ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే మ్యాజిక్ చేశాడు. సాహాను అతడు ఎల్బీగా బలిగొనగా.. కాసేపటికే కెప్టెన్ విలియమ్సన్‌ను ముస్తాఫిజుర్ ఔట్ చేశాడు. ఈ రెండు వికెట్లను ముంబై డీఆర్ఎస్ కోరి మరీ చేజిక్కించుకోవడం విశేషం. ధాటిగా ఆడుతున్న ధావన్‌ను కూడా మార్కండే బుట్టలో వేసుకున్నాడు. తన చివరి ఓవర్ ఆఖరి బంతికి షకీబుల్ హసన్‌ను ఔట్ చేసిన మార్కండే 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మయాంక్ మాయాజాలంతో సన్‌రైజర్స్ 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →