పెద్దోళ్ల పెళ్లి మరి!
దేశంలో ధనికులు మరింత ధనికులుగా, పేదోళ్లు మరింత పేదవాళ్లగా మారిపోతున్నారు. దేశంలో ఏం జరిగినా అది పేద, మధ్యతరగతిపై ప్రభావం పడుతోంది. పెద్దోళ్లకు ఎలాంటి నష్టం ఉండదు. అదే రుజువైంది మరోసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.500లు, రూ.1000ల నోట్లను ర్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో అందరూ డబ్బులు లేక అల్లాడుతున్నారు. రూ.100ల దొరికితే చాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో బడా పారిశ్రామిక వేత్త అయిన గాలి జనార్ధన్‌రెడ్డి కుమార్తె వివాహాన్ని అందరూ వాయిదా వేస్తారనుకున్నారు. కానీ పెద్దోళ్ల పెళ్లి కదా.. అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా అంగరంగ వైభవంగా చేశారు. ఈ పెళ్లికి రాజకీయ నేతలు.. సినిమా స్టార్లు.. పారిశ్రామికవేత్తలతో సహా భారీగా పెద్దలు హాజరయ్యారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు భారీగా చేశారు కూడా. అయితే ఇంత భారీగా ఎలా చేస్తున్నారన్న ప్రశ్నలకు విశ్వసనీయ వర్గాలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాయి. పెళ్లికి సంబంధించిన అన్నీ వ్యవహారాల్ని ముందుగానే ఒక ఈవెంట్ సంస్థకు అప్పగించారట.
ఆరు నెలల క్రితమే దీనికి సంబంధించిన చెల్లింపులు ముందస్తుగా జరిగాయని చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో మొదట పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నా.. కష్టమో.. నష్టమో తాము ఆ కార్యక్రమాన్ని ముందుగా అనుకున్నట్లు పూర్తి చేస్తామన్న భరోసాను సదరు సంస్థ ఇచ్చిందని చెబుతున్నారు. అందుకే గాలివారి ఇంట పెళ్లి సందడి దూం..ధాంగా జరిగింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.