Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Gayle is playing with Blush

By   /  July 6, 2016  /  Comments Off on Gayle is playing with Blush

    Print       Email

Gayle`బ్ల‌ష్‌`తో గేల్ ఆట‌లు

 

InCorpTaxAct
Suvidha

 

 

క్రికెట్ మైదానంలో బ్యాట్‌తో ఇన్ని రోజులు ఆట‌లాడుకున్న క్రిస్‌గేల్ ఇప్పుడు `బ్ల‌ష్‌`తో ఆడుకుంటున్నాడు.  చాలా రోజులుగా తీర‌ని కోరిక‌ను తీర్చుకుంటున్నాడు. వివ‌రాల్లోకి వెళ్లితే… వెస్టిండీస్‌ హిట్టర్‌ క్రిస్‌గేల్‌కు ఇప్పటి వరకు ఓ తీరని కల ఉండేదట. ఆటలో మరిన్ని మైలురాళ్లను అధిగమించాలనో.. లేదా భారీ శతకాలు బాదాలనో కాదు. తన కూతుర్ని ఎత్తుకుని గాల్లో పైకి లేపి ఆడిస్తూ ముద్దాడాలన్నది… అతని కోరిక. ఈ కోరిక నెరవేరిందని చెప్తూ గేల్‌ పాపాయితో తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రిస్‌గేల్‌ భార్య నటాషా ఓ చిన్నారికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఐపీఎల్‌-9 ఆడుతున్న క్రిస్‌గేల్‌ జమైకాలో భార్య చెంత ఉండేందుకు కొన్ని మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. అయితే ప్రస్తుతం వెస్టిండీస్‌లో కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతున్న క్రిస్‌గేల్‌ ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇంట్లో చిన్నారి ‘బ్లష్‌’తో ఆడుకునేందుకు సమయం కేటాయిస్తున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →