Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

బాలిక‌ల విద్య‌ను ప్రోత్స‌హించాలి

By   /  March 31, 2017  /  Comments Off on బాలిక‌ల విద్య‌ను ప్రోత్స‌హించాలి

    Print       Email

• గౌహతిలో క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రెండో సమావేశం
• చైర్మన్ గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో పలు నిర్ణయాలు
• దేశవ్యాప్తంగా కస్తూర్బాగాంధీ విద్యాలయాలను 8 నుంచి 12వ తరగతికి విస్తరించాలి
• కేంద్రం విద్యకు, బాలికల విద్యకు బడ్జెట్ లో నిధులు పెంచాలి
• విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో కొత్త కేజీబీవీల ఏర్పాటు
• డ్రాపవుట్లకు పాఠశాలల్లో సరైన టాయిలెట్స్ లేకపోవడం ఒక కారణంగా గుర్తింపు
• పాఠశాలల్లో బాలికలకు హెల్త్ చెకప్, హెల్త్ కిట్లు అందించాలి
• వచ్చే నెలలో ఢిల్లీలో బాలికల ఆరోగ్యం, విద్య, భద్రతలకు సంబంధించిన ఆయా శాఖలతో సమావేశం నిర్వహించాలి
దేశంలో విద్యను ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా బడ్జెట్ లో నిధులు తగ్గిస్తోందని, ఈ కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్ గా ఈ సబ్ కమిటీ గౌహతిలో తన రెండో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల ప్రాముఖ్యత గురంచి చర్చించింది.
ఈ విద్యాలయాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, వీటిని విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నది. ప్రస్తుతం కేజీబీవీలకు 8వ తరగతి వరకే కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోందని, అయితే వీటిని 12వ తరగతి వరకు విస్తరించి కేంద్రమే పూర్తిగా ఆర్ధిక సాయం అందించాలని ప్రతిపాదించింది. బాలికల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కమిటీ నిర్ణయించింది. పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ లేకపోవడం వల్ల కూడా డ్రాపవుట్స్ అవుతున్నాయని గుర్తించి, కనీసం బాలికలకు ఒక టాయిలెట్ నిర్మించడం, అది పనిచేసే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించింది.
బాలికలకు హెల్త్ చెకప్ చేయించి హెల్త్ కార్డులందించాలని, హెల్త్ కిట్లు ఇవ్వాలని, వాటిల్లో బాలికలకు అవసరమైన అన్ని మందులు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వచ్చే నెలలో ఢిల్లీలో బాలికల విద్య, ఆరోగ్యం మరియు భద్రతపై పనిచేస్తున్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బాలికల విద్య తగ్గడానికి, బాలికలు పాఠశాలల్లో బాలికల నమోదు తక్కువగా ఉండడానికి గల కారణాలు క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు సీనియర్ అధికారులతో ఒక కమిటీని నియమించాలని సబ్ కమిటీ నిర్ణయించింది.
వీటితో పాటు బాలికల పాఠశాలల్లోని పరిస్థితులు, వనరులు, వసతుల గురించి కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులుగా ఉన్న అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, ఝార్ఖండ్ మంత్రి నీరా యాదవ్, సభ్య కార్యదర్శి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్‌ పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, కేంద్ర పాఠశాల విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సావిత్రి, ఎన్ సిఈఆర్టీ, ఎన్ఈయుపిఏ, ఎన్ సీటీఈ అధికారులు హాజరయ్యారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →