Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Global Legend: “మన ఆణిముత్యాలు – 22..సుప్రసిద్ధ సినీ నటుడు.. శ్రీ కమల్ హాసన్”

By   /  November 7, 2016  /  No Comments

    Print       Email

kamalhassan_1మన భారతదేశం గర్వించదగిన ఒక పరమాద్భుతమైన కళాకారుడు కమల్ హాసన్ అత్యుత్తమ జాతీయ నటుడు. బహుముఖ ప్రజ్ఞావంతుడు.. నటుడు, నిర్మాత, దర్శకుడు  ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు.కమల్ హాసన్ నవంబర్ 7 1954లో తమిళనాడు రాష్ట్రం..రామనాథపురం జిల్లా ‘పరముక్కుడి’ లో,పుట్టాడు.

మన ‘కమల్’ శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు నాలుగో సంతానం మరియు ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం “హాసన్” అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ మూడున్నర యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం “కలత్తూర్ కన్నమ్మ”. బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసాడు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు’కె.బాలచందర్ తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసాడు. భరతనాట్యంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.మొదటి చిత్రానికే ఉత్తమ బాలనటుడుగా అవార్డ్ అందుకున్న ధీరుడు కమల్.
70వ దశాబ్దంలో కమల్ పూర్తిస్థాయి సినిమాలల్లో నటించాడు.తమిళంలోనే కాకుండా ప్రసిద్ధ మలయాళ దర్శకుల చిత్రాలలో నటించినా మన కథానాయిక శ్రీదేవితో ”16పయదినిలె(తెలుగులో పదహారేళ్ళ వయసు ) కమల్ కి చాలా మంచి పేరు తెచ్చింది.ఆ తరువాత శ్రీ బాలచందర్ తో చేసిన ‘మరోచరిత్ర’ సంగతి మహా చరిత్ర్రే సృష్టించింది కదా.శ్రీదేవితో ప్రసిద్ధ జంటగా 23 చిత్రాలలో నటించాడు.
ఎన్నో వైవిద్యభరితమైన విభిన్న పాత్రలలో నటిస్తూ భారత ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు.అంధ వయొలిన్ విద్వాంసునిగా ‘రాజ పార్వయి’చిత్రంలో
 నటించాడు. ఇదే కమల్ స్క్రీన్ ప్లే వహించిన తొలి చిత్రం.శాస్త్రీయ నృత్య కళాకారునిగా ‘సాగరసంగమం’,ప్రేమలో పడే మానసిక వికలాంగిగా ‘స్వాతిముత్యం’,అజ్ఞాత పోలీసుగా’కాకి చట్టై’చిత్రం,అండర్ వరల్డ్ డాన్ గా’నాయిగన్'(నాయకుడు) చిత్రం..తరువాత  శ్రీ ‘మణిరత్నం’ దర్శకత్వంలో ఒక నిరుద్యోగ యువకుడు ఒక వారం పాటు భోగ భాగ్యాలు అనుభవించే పాత్రలో మూకీ చిత్రం అయిన’పుష్పక్’లో (పుష్పక విమానం),నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా, స ‘ర్కస్ లో మరుగుజ్జు బఫూన్ గా, సరదాగా ఉండే మెకానిక్ పాత్రలలో ‘అపూర్వ సగోదరర్ గళ్ (విచిత్ర సోదరులు-స్క్రీన్ప్లే కూడా)చేయటం మరి గొప్ప నటుడుగా ప్రశంశలండుకోవడం జరిగింది.

kamal-story_647_110416051148కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఈయన ఉత్తమ బాల్యనటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని’కలతూర్ కన్నమ్మ’కు ఆనాడే గెలుచుకున్నాడు. ఇవే కాకుండా’సాగరసంగమం,స్వాతిముత్యం’  చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో’ఆసియా చిత్రోత్సవాలలో’ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. మరో ప్రతిష్ఠాత్మక ‘ఫిలిం ఫేర్’ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారత దేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు/నటికీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను’పద్మశ్రీ’బిరుదంతో గౌరవించింది. 2005లో ‘మద్రాసు’ లోని’సత్యభామ విశ్వవిద్యాలయం’ ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్రప్రభుత్వం ‘పద్మభూషణ్’పురస్కారాన్ని ప్రకటించింది.

InCorpTaxAct
Suvidha

మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను’తమిళనాడు’ ప్రభుత్వం ఆయన్ను’కలి మామణి'(కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.

కమల్ హసన్ 1981 నుండి’రాజ్ కమల్’ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం’రాజపార్వై’. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి ఎన్నోమంచి చిత్రాలు రూపొందాయి.
2005లో కమల్ హసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది.
amita1కమల్ హాసన్’వాణిగణపతి’ అనే ఆమెను వివాహమాడాడు.తర్వాత’సారిక’తో  తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన’గౌతమి’తో సహజీవనం సాగిస్తున్నాడు.
తన అభిమానసంఘాలను సమాజానికి సేవాసంస్థలుగా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్. ‘హేరాం’ఈ సినిమాలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా, స్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్రను కించపరిచారని సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపించాయి. 2002నాటి’పంచతంత్రం’సినిమాలోని ఒక పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. చివరికి ఆ పాటను తీసివేసి సినిమా విడుదల చేశారు.
పలు చిత్రాలు ఎన్నో వివాదాలు రేపినా తన చిత్రబృందానికి రక్షణ కల్పించాలని స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కమల్ హాసన్ కలవగా తర్వాత విస్తృత ప్రజానీకం భద్రత దృష్ట్యా కల్పించలేమని ఆయన తిరస్కరించారు. ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను కమల్ హసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చుకున్నారు.
  విశ్వరూపం సినిమా ఇస్లాం మతాన్ని తక్కువచేసి చూపిందని ఆరోపణలు రాగా, తమిళనాడు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ సినిమాను నిషేధించింది. కొన్ని దృశ్యాలను తొలగించి, కొన్ని సంభాషణలు మ్యూట్ చేసేందుకు కమల్ అంగీకరించాకా దాదాపు విడుదల అయిన 22 రోజులకు ప్రభుత్వం నిషేధాన్ని సడలించింది. 2015లో విడుదల అయిన ఉత్తమ విలన్ చలనచిత్రం క్లైమాక్స్ పాట హిందువులను అవమానిస్తోందని ఆరోపిస్తూ విశ్వహిందూపరిషత్ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసింది, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక ప్రెంచి ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని కాపీచేస్తున్నట్టు వుందని గొడవ జరిగింది.ఎలాంటి వివాదాలు తలెత్తినా చలించక తనదైన శైలిలో సమాజాన్ని మేలుకోలిపెందుకు నవరస భరితంగా అలరిస్తూనే సంచలనాలను సృష్టించిన ఏకైక మహోదాత్త నాయకుడు కమల్.
మరి దేశానికి పనికొచ్చే పనులు..ప్రపంచాన్నిఉర్రూతలూగించే విశేషమైన విజ్ఞాదయకమైన సినిమాలు అందించిన కమల్ జీవిటానికి ఇది  సంక్షిప్త రూపం మాత్రమే.’కమల్ హాసన్’ విశ్వరూపం యావత్ ప్రపంచానికి సువిదితమేగా. 
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →