Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Go for voting and Save Democracy: Rahul Dravid

By   /  March 30, 2018  /  Comments Off on Go for voting and Save Democracy: Rahul Dravid

    Print       Email

ఓటు వేద్దాం.. ప్ర‌జాస్వామ్యాన్ని గెలిపిద్దాం

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* ఇదే రాహుల్ ద్రావిడ్ ఎన్నిక‌ల సందేశం

* క‌ర్ణాట‌క ఎన్నిక‌లు అంబాసిడ‌ర్‌గా రాహుల్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: కర్ణాటక ఎన్నికల కోసం రాహుల్ ద్రావిడ్‌ను అంబాసిడర్‌గా నియమించిన నేపథ్యంలో ద్రావిడ్‌తో చేసిన ఎన్నికల అవగాహన వీడియోను ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసింది. 30 క్షణాల నిడివి ఉన్న కన్నడ, ఆంగ్ల వీడియోలను ఈసీ విడుదల చేసింది. ఆ వీడియోలను అన్ని ప్రధాన టీవీ చానెళ్లలో ప్రసారం చేస్తామనిఈసీ ప్రకటించింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడం కోసం ద్రావిడ్‌తో వ్యవస్థీకృత ఓటర్ అవగాహన, ఎన్నికల్లో భాగస్వామ్యం కోసం పలు ప్రాంతాల్లో ద్రావిడ్‌తో ప్రచారం చేయించనుంది ఈసీ. కొత్తగా 15.42 లక్షల మంది ఓటర్లు నమోదైనందువల్ల ద్రావిడ్ ప్రచారం నిర్వహిస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తోంది ఈసీ. కాగా, ఎన్నికల్లో తొలి ఓటు రాహుల్ ద్రావిడ్‌దేనని ఈసీ వెల్లడించింది.

‘‘ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం అందరం కలిసి ఓ మంచి ఆట ఆడదాం. విలువలతో కూడిన ఎన్నికలకు ఓకే అనండి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం ఓటేయండి. నేనూ ఓటేస్తాను. కాబట్టి ప్రియమైన యువతీయువకులారా.. మెరుగైన భవిష్యత్ కోసం ఓటేసేందుకు ఇదే సరైన సమయం. అందరూ బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తుంది. మీరంతా ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. క్రికెట్‌లో ప్రతీ ఆటగాడు ముఖ్యమే. ప్రజాస్వామ్యంలో కూడా అంతే. ప్రతీ పౌరుడూ ప్రధానమే. నేను ఓటేస్తా.. మీరూ ఓటేయండి’’ అని ద్రావిడ్ తన వీడియోలో సందేశం ఇస్తాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →