Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

GO passed, No Benefit Shows for ‘Janatha Garage’..?

By   /  August 30, 2016  /  Comments Off on GO passed, No Benefit Shows for ‘Janatha Garage’..?

    Print       Email

janatha garage 2ఎన్టీఆర్ అభిమానులకు చేదు వార్త..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు చేదు వార్త. ఏపీలో ‘జనతా గ్యారేజ్‌’కు షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ లో బెనిఫిట్ షోలు ఉండబోవు. దీనికిగాను ఆ రాష్ట్ర సర్కారు జీవో కూడా జారీ చేసింది. సెప్టెంబరు 1న అర్ధరాత్రి, తెల్లవారుజామున వేసే సినిమా షోలను నిషేధిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు.. బెజవాడకు చెందిన కొందరు ‘జనతా గ్యారేజ్’ బెనిఫిట్ షో హక్కులను ఏకంగా రూ.25 లక్షలు పెట్టి దక్కించుకున్నారని టాక్ . తాజాగా సర్కారు నిర్ణయంతో డిస్ట్రిబ్యూటర్‌ లు బాగా నష్టపోయే అవకాశం ఉందని సమాచారం.

అయితే.. తెలంగాణలో మాత్రం షరా మాములుగా బెనిఫిట్ షోలు ఉంటాయి. హైదరాబాద్‌ లో బెనిఫిట్ షో హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ ఏకంగా రూ.70 లక్షలకు కొనేసింది. కూకట్‌పల్లి, దిల్‌సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లోని థియేటర్లలో ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేయబోతున్నట్లు సమాచారం.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →