Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Goadavari pushkaram stampede incident report, they are not human beings!

By   /  May 16, 2016  /  Comments Off on Goadavari pushkaram stampede incident report, they are not human beings!

    Print       Email

chandrababuఅస‌లు వీళ్లు మ‌నుషులేనా?

 

InCorpTaxAct
Suvidha

 

 

గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయకులు మరణించటం తెలిసిందే.ఆ ఉదంతం ఇప్ప‌టికీ క‌ళ్ల ముంద‌రే క‌నిపిస్తోంది. ఒకేరోజు 27 మంది తొక్కిస‌లాట‌లో చ‌నిపోవ‌డంతో చంద్ర‌బాబు స‌ర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంతేకాదు చంద్ర‌బాబు ప్ర‌చార ఆర్భాటం వ‌ల్లే ఆ 27 మంది చ‌నిపోయార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించాయి. అందుకు ఆధారాలను కూడా వీడియోల ద్వారా చూపించాయి. ఈ సంఘ‌ట‌న‌కు కారుకులైన వారికి గుర్తించి వారికి క‌ఠిన‌మైన శిక్ష వేయాల‌ని డిమాండ్ కూడా చేశాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు డ్యామేజ్ అయిన తన ఇమేజ్ ను తిరిగి బిల్డ్ చేసుకునేందుకు బాబు పడిన కష్టం అంతా ఇంతా కాదు.  ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి విమ‌ర్శ‌లు ఎక్కువ‌వుతున్న త‌రుణంలో గోదావరి పుష్కరాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట.. ఈ దుర్ఘటన తీరు తెన్నుల గురించి ఒక నివేదిక సిద్ధం చేయాలంటూ ఏపీ సర్కారు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు  చేసింది.

కాగా తొక్కిసలాట ఘటనకు సంబంధించి తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ 15 పేజీల నివేదిక త‌యారు చేసి స‌ర్కార్‌కు అంద‌జేశారు. ఆ సారంశం చ‌దివిన వాళ్లు ఎవ‌రైనా మాన‌వ‌త్వం ఉంటే ఖ‌చ్చితంగా చ‌లించ‌క‌మాన‌వ‌రు. ఇంత‌కీ ఆ సారాంశం ఏంటంటే ఆ చ‌నిపోయిన వాళ్లు  గంటల తరబడి నిద్రాహారాలు లేకుండా నిరీక్షించి ఎండవేడిమి కారణంగా డీహైడ్రేషన్ కు గురయ్యారని.. ఆక్సిజన్ అందకపోవటం కూడా తొక్కిసలాటకు కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. అధికారులు.. పోలీసుల సమూహాన్ని సమర్థవంతంగా నియంత్రించినా అనుకోకుండా ఈ ఘటన జరిగిందంటూ చెప్పుకొచ్చారు. ఈ నివేదిక బాబు వ‌ల్ల జ‌రిగింద‌ని ఎక్క‌డా కూడా పేర్కొన‌లేదు. కాగా ఈ నివేదిక చూసిన ప్ర‌తిప‌క్ష స‌భ్యులు మాత్రం రిపోర్టు ఇచ్చిన వాళ్లుకానీ.. రిపోర్టుకు ఆదేశించిన వాళ్లు కానీ మాన‌వ‌త్వంతో ఆలోచించ‌లేద‌ని, అస‌లు వీళ్లు మ‌నుషులేనా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి రిపోర్టులు చూసిన‌ప్పుడు మాన‌వ‌త్త్వం ఎప్పుడో స‌మాధి అయిపోయింద‌నిపిస్తుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →