Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

God will decide my destiny, Rajanikanth

By   /  March 6, 2018  /  Comments Off on God will decide my destiny, Rajanikanth

    Print       Email

దేవుడు శాసించాడు.. ర‌జ‌నీ పాటిస్తాడు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* ముళ్ల బాటే అని తెలిసి కూడా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా
* ఎంజీఆర్‌లా ప్ర‌జా సేవ చేయాల‌నుకుంటున్నా
* కాటేసే పాములు, కాలికి గుచ్చుకునే ముళ్ల‌ను దాటుకుని వ‌స్తా
* మ‌న‌సులో మాట‌ను చెప్పిన సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌
డెక్క‌న్ అబ్రాడ్‌: “దేవుడు శాసించాడు.. అరుణాచ‌లం పాటిస్తాడు“ ఇది అరుణాచ‌లం సినిమాలో సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీ కాంత్ చెప్పే పాపుల‌ర్ డైలాగ్‌. అయితే ఆ డైలాగ్‌ను ఇప్పుడు కొంచెం మార్చి చెప్పాడు. “దేవుడు నావైపే ఉన్నాడు..క‌చ్చితంగా మంచి చేస్తాడు“ అని. చెన్నైలో ఎంజీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం ర‌జ‌నీకాంత్ త‌న రాజ‌కీయ ప్ర‌స్థానానికి సంబంధించి తొలిసారి ప్ర‌సంగించారు. రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించేందుకు తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని, దేవుడు తన వైపే ఉన్నాడని ర‌జ‌నీకాంత్‌ ధీమా వ్యక్తం చేశారు. కరుణానిధి, జీకే మూపనర్, ఇతరుల నుంచి తాను రాజకీయాల గురించి ఎంతో నేర్చుకున్నానని ఆయన తెలిపారు. రాజకీయాలు అంత సులభమైనవి కావని తనకు తెలుసని రజినీ చెప్పారు.

తమిళనాడు రాజకీయాల్లో కీలక ముద్ర వేసిన జయలలిత ప్రస్తుతం లేరని, కరుణానిధి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు ఒక సమర్థవంతమైన నేత అవసరమని రజినీ చెప్పారు. రాజకీయ బాటలో పయనించేటప్పుడు కాటేసే పాములు, కాలికి గుచ్చుకునే ముళ్లు.. మరెన్నో కష్టాలు ఉంటాయని తెలిసే వచ్చానని ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రస్థానంలో తాను కూడా ఎన్ని ఒత్తిళ్లు, సమస్యలు ఎదురైనా ఎంజీఆర్‌లా సామాన్య ప్రజలకు సేవ చేయగలనన్న నమ్మకం తనకు ఉందని రజినీకాంత్ చెప్పారు. మేకప్‌ను వేసుకోవడం మానేసి నటులు రాజకీయాల్లోకి ఎందుకొస్తున్నారని చాలామంది ప్రభుత్వంలో ఉన్నవారు, రాజకీయ నాయకులు అడుగుతున్నారని.. వారికి సమాధానం తన దగ్గర ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు తన వయసు 67సంవత్సరాలని.. నాయకులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే తాను రాజకీయాల్లోకి రావాల్సొచ్చిందని రజినీకాంత్ వివరించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →