Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Godavari river overflows, water level up

By   /  July 12, 2016  /  Comments Off on Godavari river overflows, water level up

    Print       Email

godavariప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్న గోదావ‌రి

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగు రాష్ట్రాల్లో గ‌త నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు కాలువ‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. గ‌త పాతికేళ్లుగా ఎప్పుడూ చూడ‌ని విధంగా ఈసారి గోదావ‌రి నీటి మ‌ట్టం 51.4కు చేరింది. మ‌రోవైపు ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగుతున్నాయి. వరంగల్ జిల్లా ఏటూరునాగారం వద్ద 9.90 అడుగులకు గోదావరి చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చ రికను జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరదతో రాజమండ్రి దవళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం పెరుగో తోంది. బ్యారేజీ దగ్గర నీటి మట్టం 12.10 అడుగులకు చేరింది. 175 గేట్ల ద్వారా 11లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవే శారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం దగ్గర గోదావరి పొంగిప్రవహి స్తోంది. భారీగా వచ్చి చేరుతున్న వదతో నీటిమట్టం 13.8 అడు గులకు చేరింది. భద్రాచలం దగ్గర నీటిమట్టం 52 అడుగులకు చేరడంతో పోలవరం దగ్గర నది ఉధృతి మరింత పెరుగనుంది. కొత్తూరు దగ్గర వరద నీరు 5 అడుగులకు చేరి ఏజెన్సీలోని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

కడెం వంతెన నీటమునగడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి ఉప్పొంగుతోంది. ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని పలు జలాశయాల్లోకి భారీగా నీరు చేరుతోంది. ప్రాజెక్టుల్లో నీటిమట్టం అంతకం తకూ పెరుగు తోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అటు ఆదిలాబాద్ మొదలు రాజమండ్రి వరకు నదీ పరివాహక ప్రాంతమంతా జలకళ సంతరిం చుకుంది. కుండపోత వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో పెన్‌గంగ, ప్రాణహిత నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతున్నాయి. బెజ్జూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పదివేల ఎకరాల పంట నీట మునిగింది. పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 9గేట్లు ఎత్తివేసి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.కొమరం భీం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేసి 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మత్తడి వాగు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేసి 12వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. గడ్డెన్న ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తివేసి 12వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 56 అడుగులకు చేరింది. ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగుతున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సహా యక చర్యల కోసం రెండు లాంచీలను, సబ్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం దగ్గర గోదావరి పొంగి ప్రవహిస్తోంది. భారీగా వచ్చి చేరుతున్న వరదతో నీటిమట్టం 13.8 అడుగులకు చేరింది. కొత్తూరు దగ్గర వరద నీరు 5 అడుగులకు చేరడంతో ఏజెన్సీలోని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కడెం వంతెన నీటమునగడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరదతో రాజమండ్రి ధవళేశ్వ రం దగ్గర గోదావరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 12.10 అడుగులకు చేరింది. 175గేట్ల ద్వారా 11లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →