Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Gold for love: A touching marriage proposal at the Rio Olympics

By   /  August 16, 2016  /  Comments Off on Gold for love: A touching marriage proposal at the Rio Olympics

    Print       Email

Silver medallist China's He Zi (R), reacts she receives a marriage proposal from Chinese diver Qin Kai during the podium ceremony of the Women's diving 3m Springboard Final at the Rio 2016 Olympic Games at the Maria Lenk Aquatics Stadium in Rio de Janeiro on August 14, 2016. / AFP PHOTO / CHRISTOPHE SIMONCHRISTOPHE SIMON/AFP/Getty Images

ఒలింపిక్స్ లో మ్యారేజ్ ప్రపోజల్..!

InCorpTaxAct
Suvidha

 

 

రియో ఒలింపిక్స్ లో అద్భుతాలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని ఆశక్తికర సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒలింపిక్ సాక్షిగా ఓ యువకుడు.. ఓ క్రీడాకారిణికి తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే సదరు క్రీడాకారిణి ముందుగా షాక్ కు గురైంది. కాని తర్వాత అంగీకారం తెలిపింది. దీంతో ఆ యువకుడి ఆనందానికి పట్టపగ్గాల్లేవు.

క్వీన్ కాయ్ అనే యువకుడు, హెజీ అనే యువతి చైనాకు చెందినవారు. హెజీ డైవింగ్ పోటీల్లో పాల్గొంది. మహిళల డైవింగ్ 3 మీ. స్ప్రింగ్ బోర్డ్ విభాగంలో ఆమె రజత పతకం గెలుచుకుంది. ఆ పతకాన్ని తీసుకుంటున్న సమయంలో.. అక్కడికి క్వీన్ కాయ్ వచ్చాడు. పతకం తీసుకుని పోడియం దిశగా.. ఆమె బయలుదేరింది. ఇంతలో క్వీన్ కాయ్ ఆమె దగ్గరకు వెళ్ళి మోకాళ్ళపైన కూర్చుని.. గోల్డెన్ రింగ్ ని చూపించి పెళ్ళి చేసుకుందామా అంటూ అడిగాడు. దీంతో హెజీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురైంది. అనంతరం.. ఆనందబాష్పాలతో ప్రియుడిని హత్తుకుని ఒకే చెప్పేసింది. ఈ యువకుడు తన ప్రేయసికి ఎర్ర గులాబీని కూడా కానుకగా ఇచ్చాడు.

అసలు విషయం ఏమిటంటే.. వీరిద్దరూ మంచి డైవర్లే. అంతేకాదు.. ఇరువురు గత ఆరేళ్ళుగా డేటింగ్ చేస్తున్నారట. క్వీన్ కాయ్ 3 మీటర్ల స్ప్రింగ్ బోర్డ్ లో కాంస్య పతకాన్ని గెలిచాడు. ఒలింపిక్స్ లో తన బాయ్ ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేస్తాడని ఊహించలేదని హెజీ తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →