జియో వినియోగదారులకు శుభవార్త
*రూ.99ల రీచార్జీతో గతేడాది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న కస్టమర్లకు మరో ఏడాది ఫీ
* మార్చి 31, 2019 వరకు సభ్యత్వం పొడగింపు
* మిగతా రీచార్జీలన్నీ యథాతథం
డెక్కన్ అబ్రాడ్: రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రూ.99లతో గత ఏడాది రీచార్జ్ చేయించుకున్న ప్రైమ్ మెంబర్షిప్ మార్చి 31, 2018తో ముగిసిపోయంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1, 2018 నుంచి జియో ప్రైమ్ మెంబర్షిప్ కొనసాగిస్తారా ? ఒకవేళ కొనసాగిస్తే మళ్లీ ఎంత రీచార్జ్ చేయాల్సి వుంటుంది ? ఈసారి కూడా గతేడాది లాగే ప్రైమ్ మెంబర్‌షిప్‌కి ఏడాది కాలపరిమితి ఇస్తారా లేదా అనే సందేహాలు జియో ప్రైమ్ యూజర్స్‌ని వెంటాడుతున్న పరిస్థితుల్లో వినియోగదారులకు జియో శుభవార్త చెప్పింది. ఎలాంటి రుసుం చెల్లించకుండానే మరో ఏడాది సభ్యత్వాన్ని పొడగించింది. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొత్తగా జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలని భావించే వాళ్లు తప్పనిసరిగా రూ.99 రీచార్జ్ కూపన్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుంది అని జియో స్పష్టంచేసింది.
ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్‌గా కొనసాగుతున్న వారికి రేపటి తర్వాత కూడా మరో ఏడాది పాటు ఎలాంటి చార్జీలు వర్తించకుండానే ఉచిత ప్రైమ్ సేవలు అందనున్నప్పటికీ.. అందుకోసం మీ మొబైల్లోని జియో యాప్‌లో జియో కస్టమర్ కేర్ సిబ్బంది అందించే సూచనలను అనుసరించాల్సి వుంటుంది. ఆ తర్వాత మళ్లీ వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు జియో ప్రైమ్ మెంబర్షిప్ కొనసాగుతుందని సదరు టెలికాం దిగ్గజం పేర్కొంది. కేవలం ప్రైమ్ మెంబర్షిప్ సంగతిని పక్కనపెడితే, మిగతా రీచార్జులన్నీ యధావిథిగానే అమలులో వుండనున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.