Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Good news for Watsap customers

By   /  March 6, 2018  /  Comments Off on Good news for Watsap customers

    Print       Email

వాట్సాప్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్ అప్‌డేట్‌

* గంట త‌ర్వాత మెసేజ్ డిలిట్ చేసుకునే సౌక‌ర్యం

డెక్క‌న్ అబ్రాడ్‌:  వాట్సాప్ వినియోగ‌దారుల‌కు తాజాగా మ‌రో శుభ‌వార్త‌. ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌‌’ కొత్త అప్‌డేట్ వెర్సన్ వచ్చేసింది. తాజాగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ బీటాఇన్‌ఫో అప్‌డేట్‌ చేసింది. వాట్సాప్ బీటా (వీ2.18.69) వెర్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా గంట సమయం తర్వాత కూడా ఇతరులకు పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం 7 నిమిషాల్లోపు మాత్రమే పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసే వీలుంది. ఇటీవలే ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ అనే అప్‌డేట్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పొరపాటుగా అనవసరమైన ఓ మెసేజ్‌లను ఇతరులకు పంపిస్తే.. వారు చూడకముందే ఆ మెసేజ్‌ను డిలీట్ చేసే సదుపాయాన్ని దీనిద్వారా కల్పించింది. అయితే, ఆ వెర్షన్‌లో డిలీట్ చేయాలనుకున్న మెసేజ్‌ను ఏడు నిమిషాల(420 సెకన్లు) లోపే చేసేయాలి. తాజా అప్‌డేట్‌తో మెసేజ్‌లను 7 నిమిషాల్లోపే కాకుండా గంట తర్వాత కూడా డిలీట్‌ చేసుకోవచ్చు.

ఇతరులకు పంపించిన మెసేజ్‌లను 4,096 సెకన్లలోపు (68 నిమిషాల 16 సెకన్లలోపు) వరకు డిలీట్‌ చేసుకోవచ్చు. (వీ2.18.68) వాట్సాప్ బీటా వెర్షన్‌ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం స్టిక్కర్ ఫీచర‌ అప్‌డేట్‌ను కూడా అందిస్తోంది. కానీ, ఆ ఫీచర్ అప్రమేయంగా డిసేబుల్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్‌లో పనిచేసే మరో రెండు బీటా వెర్షన్‌ (వీ2.18.70, వీ.2.18.71) లను వాట్సాప్ ప్రవేశపెట్టింది. త్వరలో ఐఫోన్‌లో కూడా ప్రవేశపెట్టాలని వాట్సాప్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Negativity and Positivity

Read More →