Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Google gets court notice for listing PM Modi in ‘top 10 criminals’ search

By   /  July 21, 2016  /  Comments Off on Google gets court notice for listing PM Modi in ‘top 10 criminals’ search

    Print       Email

Modi criminalsమోడీ క్రిమిన‌లా?

 

InCorpTaxAct
Suvidha

 

 

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క్రిమిన‌లా? ఆయ‌న పేరు మోసిన ప్ర‌పంచ నేర‌గాళ్ల లిస్టులో ఉన్నారా?  అంటే అవున‌నే అంటోంది ప్ర‌ముఖ సెర్చింజ‌న్ గూగుల్ సంస్థ‌. మోడీ భార‌త‌దేశ ప్ర‌ధాని ఏమో కానీ ప్ర‌పంచంలోనే టాప్‌-10 నేర‌గాళ్ల లిస్టులో ఆయ‌న పేరును చేర్చేసింది. ఇది ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భావితం చేసే వ్య‌క్తుల్లో మోడీ ఒక‌ర‌ని తాజా స‌ర్వేలు స్ప‌ష్టం చేయ‌డం… ఒక దేశ ప్ర‌ధానిగా కోట్ల మంది అభిమానులు సొంతం చేసుకున్న వ్య‌క్తిగా మోడీ గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఏమని రావాలి..ఇండియా ప్రైమ్ మినిస్టర్ అని క్లీయర్ గా రావాలి. అయితే గూగుల్ సంస్థ మోడీని ప్రపంచంలోనే టాప్-10 మోస్ట్ వాంటెండ్ క్రిమినల్స్ లో ఒకరిగా చేర్చేసింది. గూగుల్ సంస్థ చేసిన ఈ నిర్వాకానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. గూగుల్ మోడీని తీవ్రంగా అవమానపరిచిందంటూ ఓ న్యాయవాది అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. గూగుల్ సంస్థతో పాటు సీఈవో – ఆ సంస్థ ఇండియా హెడ్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే గూగుల్ సంస్థ వరల్డ్ టాప్-10 క్రిమినల్స్ లిస్ట్ ఇదేనంటూ ఓ జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో మోడీ పేరు కూడా ఉంది. దీన్ని గమనించిన ఆలహాబాద్ న్యాయవాది సుశీల్ కుమార్ ఆ జాబితా నుంచి మోడీ పేరు తీసేయాలని గూగుల్ ను కోరారు. అయితే గూగుల్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సుశీల్ చివరకు అలహాబాదు చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన సీజేఎం కోర్టు గత నవంబర్ లో ఈ పిటిషన్ ను కొట్టేసింది. సీజేఎం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుశీల్ అలహాబాదులోని మరో కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివిజన్ పిటిషన్ పై బుధవారం విచారణ చేసిన కోర్టు గూగుల్ సంస్థతో పాటు ఆ సంస్థ సీఈవో – గూగుల్ ఇండియా హెడ్ లకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఏదేమైనా ఇలాంటి విష‌యాలు దేశ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →