డబ్బింగ్ జరుపుకుంటున్న ‘ఆక్సిజన్’
గోపీచంద్-ఎఎం.జ్యోతికృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘ఆక్సిజన్’. ఈ సినిమాని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఐశ్వర్య ‘ఆక్సిజన్’ మూవీ గురించి అప్ డేట్ ఇచ్చారు.
గోపీచంద్ హీరోగా తాము నిర్మిస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందన్నారు. ఇప్పటివరకు 90 శాతం మేర షూటింగ్ పూర్తైందని తెలిపారు. డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిస్తున్న ‘ఆక్సిజన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘ఆక్సిజన్’మూవీలో గోపీ చంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు కీ రోల్ లో నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. అలాగే సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ తమ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మూవీ ఆడియోని సెప్టెంబర్ లో విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అదే నెలలో సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కసరత్తు చేస్తోంది.
ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో అను ఇమ్మాన్యువల్, కిక్ శ్యామ్, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్:పీటర్ హెయిన్స్, ఆర్ట్: మిలన్, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.