Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Government is making special arrangements for krishna puskharalu 2016

By   /  August 5, 2016  /  Comments Off on Government is making special arrangements for krishna puskharalu 2016

    Print       Email

Krishna Pushkaramపుష్క‌రాల‌కు స‌ర్వం సిద్ధం

 

InCorpTaxAct
Suvidha

 

 

కృష్ణ పుష్క‌రాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. స‌మ‌యం ద‌గ్గ‌రికి వ‌స్తున్న కొద్దీ ఏర్పాట్లుముమ్మ‌రం చేశారు. గ‌త సంఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అలాంటివి పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మంత్రుల‌కు, అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు కూడా జారీ చేసిన విష‌యం తెలిసిందే. కాగా మంత్రులు కూడా అధికారుల‌కు మీటింగ్‌లు ఏర్పాటు చేసి ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఓ స‌మావేశం ఏర్పాటు చేసి కృష్ణ‌పుష్క‌రాల‌లో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా సేవ‌లందించాల‌ని పిలుపునిచ్చారు. స్థానిక క‌లెక్ట‌ర్ కాంతిలాల్ దండే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగుకోట్ల మంది సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.  గత పుష్కరాలకు జిల్లాలో 40 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారని, ఈ ఏడాది 80 ఘాట్లలో కోటి మందికి పైగా తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు అధికారులు అంటున్నారు.

ఇదిలా ఉంటే యాత్రికులకు అన్ని వస్తువులు దొరికేలా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేశారు. డ్రెస్‌లు మార్చుకొనేందుకు గ‌దులు, పార్కింగ్, సమాచార నిర్వహణ వంటి సదుపాయాలు  ఇప్ప‌టికే పూర్తి అయ్యాయి. అయితే  యాత్రికులకు ఇస్కాన్, కొన్ని స్వచ్చంద సంస్థలు భోజన వసతి క‌ల్పించ‌నున్నారు. కాగా ఇంకా చాలా చోట్ల ఘాట్లు పూర్తి కాలేద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌జా ధ‌నాన్ని దోచుకోవ‌డానికే ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తాత్కాలికంగా ప‌నులు చేప‌డుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →